అతన్నే పట్టుకుని వేలాడలేను... భర్తతో విడాకులపై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ ప్రముఖుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు. అందుకే గాసిప్స్‌కి మన దగ్గర గిరాకీ ఎక్కువ. ఈ ఏడాది ఎక్కువగా విడాకులు, బ్రేకప్స్, ఎఫైర్స్‌కి సంబంధించిన వార్తలు బాగా నడిచాయి. బుల్లితెర నుంచి వెండితెర వరకు చాలామంది సెలబ్రిటీలు వారి విడాకులు, భరణం ఇష్యూలపై వార్తల్లో నిలిచారు. సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వాములను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం, పెళ్లి ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం వంటివి చేస్తే చాలు.. జనాల్లో అనుమానలు మొదలైపోతున్నాయి. విడాకులపై ఎవరనా ప్రముఖులు మాట్లాడితే.. వీరు త్వరలో బ్రేకప్ కాబోతున్నారని విస్త్రతంగా వార్తలు వచ్చేస్తున్నాయి. తాజాగా సీనియర్ నటి ప్రేమ గతంలో జరిగిన తన విడాకులపై ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటీమణుల్లో ప్రేమ కూడా ఒకరు. దాదాపు మూడు దశాబ్ధాల సినీ కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు ప్రేమ. 18 ఏళ్ల వయసులోనే నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎలాంటి మచ్చ లేకుండా జీవితాన్ని, కెరీర్‌ను కొనసాగిస్తున్నారు ప్రేమ. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే ప్రేమ విడాకులు తీసుకోవడం కలకలం రేపింది.

ఓమ్‌తో సంచలనం
కొడవ కమ్యూనిటీకి చెందిన కుటుంబంలో జన్మించారు ప్రేమ. కొడగు, బెంగళూరులలో చదువుకున్నారు. కరునాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ సరసన సవ్యసాచి అనే సినిమా ద్వారా 1995లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ప్రేమ. ఈ దశలో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఓమ్‌తో కన్నడ నాట సంచలనం సృష్టించడంతో పాటు రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయారు. ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగువారిని పలకరించిన ఆమె అనంతరం ఇక్కడా పలు చిత్రాలతో బిజీ అయ్యారు. జగదేకవీరుడు, అదిరింది గురు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి, నాగదేవత, అమ్మో ఒకటో తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, ప్రేమతో రా తదితర చిత్రాలలో నటించారు.
పెళ్లయిన పదేళ్లకి విడాకులు
కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచుని పెళ్లాడారు ప్రేమ. కానీ ఏం జరిగిందో ఏమో కానీ పదేళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ ప్రేమ- జీవన్‌లు 2016లో విడాకులు తీసుకుని విడిపోయారు. నాటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రేమ.. తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులపై ప్రేమ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఛాలెంజ్‌లను ఫేస్ చేయాల్సిందే
వృత్తి జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. నేనెప్పుడు పర్సనల్ లైఫ్‌ని ప్రొఫెషన్‌లోకి తీసుకురాలేదు. దీనిపై ఎవ్వరూ అడగలేదు, మాట్లాడలేదు. నాకు నచ్చపోతే స్ట్రెట్‌గా డెసిషన్ తీసుకుంటాను.. ఇది నా జీవితం. విడాకుల గురించి నా తల్లిదండ్రులతో చర్చించా.. వాళ్లు కూడా ఎంకరేజ్ చేశారు. నా జీవితం నాకు ముఖ్యం.. అందుకే నచ్చిన విధంగా నిర్ణయం తీసుకున్నా. సూసైడ్ చేసుకునే చాలామంది అమ్మాయిలకు కూడా ఇదే చెబుతా. అలాంటి పరిస్ధితులు ఖచ్చితంగా వస్తాయని నాకు తెలుసు. కానీ నేను సూసైడ్ వరకు వెళ్లలేదు. దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా అని ప్రేమ అన్నారు.
సోసైటీ కోసం బతకొద్దు
అలాంటి పరిస్ధితులు వస్తాయి.. మీరు దానిని ఎలా ఎదుర్కొన్నారు అన్నదే మీకు ముఖ్యం. మనుషులకు కాకపోతే కుక్కలకి రావు కదా. సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. నీకు నచ్చకపోతే.. ప్రపంచం చాలా పెద్దది, ఏదో ఒక పనిచేస్తూ దాని నుంచి డైవర్ట్ అవ్వండి. నచ్చకపోతే ఇదే జీవితం కాదు. నీకు శక్తి, స్వేచ్చ ఉన్నాయి. అందువల్ల ఛాలెంజ్‌లు తీసుకోండి. అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. నిర్ణయం నేనే తీసుకున్నాను కాబట్టి.. నేనే వ్యక్తిగతం కోర్టుకు వెళ్లాను. అమ్మానాన్న వెంట వస్తామని చెప్పినా వద్దు అన్నాను. నేనే కోర్టుకు హాజరై చూసుకుంటానని చెప్పా. నిర్ణయాలు తీసుకునే శక్తి ఆడవాళ్లకి ఉంది. ఆడపిల్లలని తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్లని బాగా చూసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిల గురించి తల్లిదండ్రులకు మించి ఎవ్వరికీ తెలియదు. నా విషయంలో చెల్లెలు, తమ్ముడు, అమ్మ నాకు అండగా నిలబడ్డారు. ఒకవేళ మీ భర్త బాగా చూసుకుంటుంటే, బాగా సపోర్ట్ చేస్తున్నాడు, సర్దుకుపోతే సరిపోతుంది అనుకున్నప్పుడు కలపాలని చూసినా పర్లేదు. సోసైటీ కోసం బతకాల్సిన అవసరం లేదు.. భరించేది మీరు అని ప్రేమ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











