నా శరీరాన్ని అమ్ముకొను.. ఇండస్ట్రీలో పరిస్ధితులపై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఏ విషయాన్ని అయినా ముఖంపై కొట్టినట్లు మాట్లాడతారు చెన్నై బ్యూటీ ప్రియా భవానీ శంకర్. స్కిన్ షోకు దూరంగా ఉంటూనే అవకాశాలను అందుకుంటున్నారు ప్రియ. ఆమె కోలీవుడ్ స్టార్ జీవాతో కలిసి నటించిన బ్లాక్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రియ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్లు స్కిన్ షో చేస్తుండటంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

న్యూస్ రీడర్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ప్రియ భవానీ శంకర్.. తర్వాత తమిళ బుల్లితెరపై సీరియల్స్‌లో హల్‌చల్ చేశారు. ఈ పాపులారిటీతో సినిమాల్లో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. మేయాద మాన్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియ వరుస హిట్స్‌తో కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీలు తెలుగులోకి డబ్ కావడంతో ఇక్కడి వారికి కూడా ప్రియ దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో 2023లో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం మూవీతో తెలుగులో తొలిసారి నటించారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన భీమాలోనూ సందడి చేశారు, దూత వెబ్‌సిరీస్‌లో అక్కినేని నాగచైతన్యకు భార్యగా నటించారు.

Actress priya bhavani shankar about cleavage show here s the details

అందరు హీరోయిన్ల మాదిరిగానే ప్రియా భవానీ శంకర్‌పైనా ఎన్నో రూమర్స్ వచ్చాయి. తాను చాలా మంది స్టార్స్‌తో వర్క్ చేయడంతో .. వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర సందర్భాల్లో విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని ప్రియా తెలిపారు. అలా పెట్టడమే తరువాయి .. సదరు హీరోతో తాను రిలేషన్‌లో ఉన్నట్లుగా రకరకాల న్యూస్ వైరల్ అయ్యేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .

ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఏమాత్రం దాపరికం లేకుండా తన బాయ్‌ఫ్రెండ్ రాజ్‌ను , అతనితో తన రిలేషన్‌ను బయటపెట్టేశారు ప్రియ. అయితే వీరిద్దరికి బ్రేకప్ జరిగినట్లుగా ఎన్నోసార్లు గాసిప్స్ హల్‌చల్ చేశాయి. రాజ్‌- నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే సరైన సమయం దొరకలేదని , వచ్చే ఏడాది ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామని ప్రియా భవానీ శంకర్ మొన్నామధ్య వెల్లడించారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ జీవా హీరోగా నటించిన బ్లాక్ సినిమాలో ఆయనకు హీరోయిన్‌గా నటించారు ప్రియా భవానీ శంకర్. కేజీ బాలసుబ్రమణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ప్రియ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్లు గ్లామర్ షో చేయడంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

తన శరీరం ఒక వస్తువు కాదని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి గ్లామర్ షో చేయనని ప్రియ తేల్చి చెప్పారు. హీరోయిన్‌గా ఫ్యాషన్ పేరు చెప్పి కొన్ని అంశాలను ప్రమోట్ చేయలేనని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదనే ఎప్పుడూ అనుకుంటానని ప్రియా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: priya bhavani shankar jiiva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X