అల్లు అర్జున్ తో లిప్ లాక్ చేయాలని ఉంది... ఐకాన్ స్టార్ తో రొమాన్స్ పై యంగ్ హీరోయిన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2 : ది రూల్'తో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగిపోయారు. అప్పటికే ఆయనకు కేరళ, కన్నడలో మంచి ఫాయిలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'పుష్ప' సిరీస్ లతో నార్త్ లోనూ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. బన్నీ కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా 'పుష్ప' రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అదొక ఐకానిక్ ఫిల్మ్ గా నిలిచింది. మరోవైపు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే కాసుల వర్షం కురిపించింది.

పుష్ప2 : ది రూల్ బాక్సాఫీస్ వద్ద రూ.1870 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ఇండియాలోనే హయ్యేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన చిత్రాల్లో Pushpa 2 : The Rule రెండో స్థానాన్ని దక్కించుకోవడం సెన్సేషన్ గా మారింది. బాహుబలి క్రియేట్ చేసిన రూ.1830 కోట్ల కలెక్షన్స్ ను 'పుష్ప2' దాటేసింది. కానీ ఈ లెక్కల్లో కాస్తా తేడా ఉందనే వాదన కూడా వినిపించడం గమనార్హం. ఏదేమైనా.. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ తో పుష్ప2 సెన్సేషన్ క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. బన్నీ నటనకు ఆయన ఫ్యాన్సే కాదు.. నార్మల్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు.

Actress Priya Bhavani Shankar wishes to do Romance with Allu Arjun on Big Screen Here is Her Interesting Words

ఇదిలా.. బన్నీతో నటించాలని చాలా మంది హీరోయిన్లకు ఆశగా ఉంటుంది. ఒక్క అవకాశం వస్తే చాలు అంటూ ఎంతో ఆసక్తికంగా ఎదురుచూస్తు ఉంటారు. అది జరగకపోయే సరికి ఆయా ఇంటర్వ్యూల్లో తమ మనస్సులోని మాటను బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి ప్రియా భవానీ శంకర్ ఓ సందర్భంలో తన మనస్సుల్లోని మాటను బయటపెట్టింది. ఏకంగా అల్లు అర్జున్ తో బిగ్ స్క్రీన్ పై రొమాంటిక్ సీన్లలోనైనా నటించేస్తానని చెబుతోంది. ఇదంతా 'కళ్యాణం కమనీయం' మూవీ ప్రమోషన్స్ లో సంతోష్ శోభన్ అడగ్గా ప్రియా భవానీ మాట్లాడిన మాటలు.

ప్రియా భవానీ శంకర్ పూర్తి పేరు సత్యప్రియా భవానీ శంకర్. ఆమె బీటెక్ తో పాటు ఎంబీఏ కోర్సులో పట్టా పొందింది. తమిళం, తెలుగులో టెలివిజన్ ప్రజెంటర్ గా మారి ఆకట్టుకుంది. ప్రస్తుతంగా నటిగా, హీరోయిన్ గా పలు చిత్రాల్లో మెరుస్తూ ఆకట్టుకుంటూనే వస్తోంది. అటు తమిళ చిత్రాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ ఆడియెన్స్ లో మరింత పేరు సంపాదించుకుంటోంది.

Actress Priya Bhavani Shankar wishes to do Romance with Allu Arjun on Big Screen Here is Her Interesting Words

ఇప్పటి వరకు ప్రియాభవానీ శంకర్ తెలుగులో మూడు చిత్రాల్లోనే నటించింది. సంతోష్ శోభన్ తో కలిసి 'కళ్యాణం కమనీయం' చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆడియెన్స్ ను కట్టి పడేసింది. ఆ తర్వాత గోపీచంద్ 'భీమా', సత్యదేవ్ 'జీబ్రా'.... అలాగే తమిళంలో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. చివరిగా 'ఇండియన్ 2', 'డిమోంటీ కాలనీ 2', 'బ్లాక్', 'జీబ్రా' వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం 'ఇండియన్3'లో నటిస్తోంది. ఇక ప్రియా భవానీ అల్లు అర్జున్ రాబోయే చిత్రాల్లో ఏమైనా అవకాశం దక్కించుకుంటుందా? అన్నది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X