బెడ్‌పై అలాంటి పనులు.. ఉల్లిపొర లాంటి చీరలో హుషారు బ్యూటీ గ్లామర్ షో!

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్‌లకు అవకాశాలు దక్కడం లేదని పలువురు తెలుగు అమ్మాయిలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అందం, అభినయంలో నార్త్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నప్పటికీ తమను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదని వారు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అయితే ప్రతిభావంతులకు తాము అవకాశాలు కల్పిస్తూనే ఉన్నామని మేకర్స్ చెబుతున్నారు.

వెండితెరపై ఎన్నో ఆశలతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు తెలుగు అమ్మాయి ప్రియా వడ్లమాని. అయితే ఒకటి రెండు సినిమాలు మినహా పెద్దగా ప్రాధాన్యత పాత్రలు ఆమెకు దక్కలేదు. 27 ఆగస్ట్ 1997న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు ప్రియా వడ్లమాని. ఈమె తల్లిదండ్రులు ఏపీకి చెందినవారు. మధ్యప్రదేశ్‌లో పుట్టినా హైదరాబాద్‌, బెంగళూరులలో చదువుకున్నారు ఈ ముద్దుగుమ్మ.

Actress Priya Vadlamani latest PhotoShoot with black color transparent saree

చదువు పూర్తి చేసిన తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రియా వడ్లమాని తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆమె అందం, చురుకుదనం గుర్తించిన మేకర్స్ ప్రియకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. 2018లో ప్రేమకు రెయిన్ చెక్, శుభలేఖలు సినిమాలలో నటించారు ప్రియా వడ్లమాని. ఈ దశలో హుషారు సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఇందులో రియా అనే రోల్ ఆమెకు పేరు తీసుకొచ్చింది. లవర్‌ను మోసం చేసే క్యారెక్టర్‌లో ప్రియ అద్భుతంగా నటించారు.

హుషారు తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖ చిత్రం, ఓం భీమ్ బుష్, వీరాంజనేయులు విహారయాత్ర, విశ్వం , బ్రహ్మా ఆనందం సినిమాల్లో నటించారు. ఇటీవల సీనియర్న కమెడియన్ బ్రహ్మానందం లీడ్ రోల్‌లో ఆయన కుమారుడు రాజా గౌతమ్, స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన బ్రహ్మా ఆనందంలో నటించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

అయితే ఆమె చేసిన ఓ తప్పు వల్లే కెరీర్‌ ఇలా అయ్యిందని స్వయంగా ప్రియా వడ్లమాని ఆవేదన వ్యక్తం చేశారు. సుహాస్ , చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్షలు నటించిన కలర్ ఫోటోలో తొలుత హీరోయిన్‌గా ప్రియా వడ్లమానికి అవకాశం లభించింది. అయితే ఆ సమయంలో తనకు సరిగా గైడెన్స్ ఇచ్చేవారు లేకపోవడంతో కలర్ ఫోటోలో ఆఫర్‌ను మిస్ చేసుకున్నానని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే తన కెరీర్ మరోలా ఉండేదని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి ప్రియా వడ్లమాని ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఉల్లిపొర లాంటి నల్లచీరలో బెడ్‌పై పడుకుని చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ప్రియా వడ్లమాని అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: priya vadlamani movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X