‘అలాంటి రోల్స్ లో నటించమన్నారు.. తెల్ల తోలు లేకపోవచ్చు కానీ’
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది ప్రియమణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. తెలుగులో ఎక్కువ చిత్రాల్లో నటించి సక్సెస్ అందుకుంది. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. సౌత్ కు చెందిన ప్రియమణి బాలీవుడ్ లోనూ భారీ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అక్కడ ఆమె ఎదుర్కొన్న కొన్ని విషయాలను రీసెంట్ గా బయటి పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
2003 నుంచి యాక్టివ్ గా..
బెంగళూరులో పుట్టి పెరిగిన ప్రియమణి 17 ఏళ్లలోనే సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది. హీరోయిన్ గా తొలి సినిమా అవకాశాన్ని అందుకుంది. ఎవరే ఆటగాడు అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళం, మలయాళంలో ఒక్కో సినిమా చేసి అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక ఇటీవల నారప్ప, భామాకలాపం, విరాట పర్వం వంటి చిత్రాల్లో నటించారు. హిందీలో జవాన్, మైదాన్ వంటి చిత్రాల్లో కీలక పాత్రతో అలరించింది.

ప్రస్తుతం ప్రియమణి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రియమణి తనకు వీలైనప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా తన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కొందరు నాతో ఇలా అన్నారు. మా సినిమాలో మిమ్మల్ని తీసుకోవడానికి కారణం సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఉంది కాబట్టే. అని అన్నారు. అయితే మేం జెన్యూన్ గానే సౌత్ ఇండియాకు చెందిన వాళ్లం.
దక్షిణాదిలోని భాషల్లో అనర్గళంగా మాట్లాడుతాం. ఇక అక్కడ కొందరు ప్రత్యేకంగా సౌత్ ఇండియా క్యారెక్టర్ కోసమే తీసుకుంటున్నామని చెప్పడం నచ్చలేదు. మేం నార్త్ ఇండియా యాక్ట్రెస్ లాగా తెల్లగా ఉండమేమో గానీ కచ్చితంగా అందంగా ఉంటామని చెప్పగలం. చక్కటి రూప సౌందర్యం మాత్రం కలిగి ఉంటాం. ఇక శరీర రంగు అనేది ముఖ్యం కాదనేది నా అభిప్రాయం.' అని ప్రియమణి చెప్పుకొచ్చింది. ఇప్పటికీ నార్త్ ఇండియన్ ఫిల్మ్స్ లో కలర్, ప్రాంతీయను బట్టి పాత్రను ఇస్తున్నారని, నటీనటుల నైపుణ్యాన్ని కొందరు అస్సలు చూడటం లేదని ప్రియమణి వివరించే ప్రయత్నం చేశారు.
రాబోయే చిత్రాలు..
ప్రియమణి ప్రస్తుతం తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రియమణి భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గానే హిందీ ఫిల్మ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ తోనూ ఆకట్టుకుంటోంది. నెక్ట్స్ తమిళ స్టార్ విజయ్ దళపతి జన నాయగన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే జీ.డీ.ఎన్ అనే సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











