బొడ్డు దగ్గర అలా ఉండాలి.. ప్రియమణిని వేధించిన నిర్మాత.. ఆయన ఎవరో తెలుసా?
చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంలోనే కాకుండా నటనలోనూ ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తూ ఉంటుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత మంచి కంటెంట్ ఉన్న పాత్రలలో కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ బ్యూటీ మరిన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో నటించబోతోంది. అయితే ఈ ప్రయాణంలో ఆమె కొన్నిసార్లు దర్శక నిర్మాతల నుంచి చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపింది. గతంలో ఒక నిర్మాత షూటింగ్ చివరి దశలో ఉంది అనగా అప్పుడు కొంత ఇబ్బంది కలిగించినట్లు కూడా తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

సౌత్ ఇండస్ట్రీలో
టాలీవుడ్లో మొదట 'పెళ్లయిన కొత్తలో' అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి పాత్రలలో కనిపించింది. దాదాపు ఆమె సీనియర్ స్టార్ హీరోల అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం ప్రేమ కథలు మాత్రమే కాకుండా డిఫరెంట్ యాక్షన్స్ సినిమాలలో కూడా మంచి పాత్రలలో ప్రియమణి నటించింది.

కెరీర్ బిగ్ హిట్
ముఖ్యంగా తెలుగులో బ్యూటీకి కొన్ని బిగ్ హిట్స్ కూడా ఉన్నాయి. అందులో రాజమౌళి ఎన్టీఆర్ కలయికలో వచ్చిన యమదొంగ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ప్రియమణి మంచి ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా అవకాశాలు చాలానే వచ్చాయి.

స్టార్ హీరోయిన్ గా..
అప్పట్లో ఇండస్ట్రీలోకి చాలా తొందరగా స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ అందుకున్న అతి కొద్దిమందిలో ప్రియమణి ఒకరు. అంతేకాకుండా ఆమె చాలా తొందరగా నేషనల్ అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో ఒకవైపు అగ్ర హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరొకవైపు చిన్న బడ్జెట్ లో మంచి ప్రేమ కథలలో కూడా ప్రియమణి నటించింది.

మంచి పాత్రలతో..
ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుని ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ తో అలాగే మరోవైపు సపోర్టింగ్ పాత్రలతో సినిమా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇటీవల నారప్ప సినిమాలో ఆమె చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. అలాగే రాను దగ్గుబాటి సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా నక్సలైట్ పాత్రలో కనిపించింది.

బొడ్డు దగ్గర టాటూ
అయితే ప్రియమణి తన సినిమా కెరీర్ లో కొన్నిసార్లు దర్శక నిర్మాతల నుంచి చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఒకానొక సమయంలో ఒక సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది అనగా నిర్మాత హఠాత్తుగా వచ్చే బొడ్డు మీద టాటూ వేయించుకుని ఒక సీన్ లో నటించమని చెప్పాడు. అప్పుడు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి చేయాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో సన్నివేశంలో నటించాల్సి వచ్చింది అని తెలిపింది.

నచ్చని విధంగా..
సాధారణంగా సినిమా తారల జీవితాలు చాలా హుందాగా చాలా అందంగా ఉంటాయి అని అందరూ అనుకుంటారు కానీ కొన్నిసార్లు నచ్చని పని కూడా చేయాల్సి వస్తుంది. ఆ విధంగానే తనకు నచ్చని విధంగా ఒక సన్నివేశంలో బొడ్డు మీద టాటూ వేయించుకొని నటించాల్సి వచ్చింది అని ప్రియమణి పేరు చెప్పకుండానే ఆ నిర్మాత గురించి తెలియజేస్తుంది.


Click it and Unblock the Notifications











