నాకు పిలల్ని కనాలని ఉంది.. మరో కోరిక కూడా ఉంది: ప్రియాంక చోప్రా

అందాల తార ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నది. భర్త నిక్ జోనస్‌తో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తున్నది. అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు హాలీవుడ్‌ను బ్యాలెన్స్ చేస్తూ లైఫ్‌ను సాఫీగా సాగిస్తున్నది. అయితే తాజాగా తన మనసులోని రెండు కోరికలను బయటపెట్టింది. అవేమిటంటే..

ఇటీవల వోగ్ ఇండియా సెప్టెంబర్ 2019 ఎడిషన్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నన్ను ప్రేమించే వ్యక్తులు నా చుట్టు ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నా మదిలో రెండే కోరికలు ఉన్నాయి. అందులో ఒకటి ఓ చిన్నారికి జన్మనివ్వడం. రెండోది లాస్ ఎంజెలెస్‌లో ఇల్లు కొనుక్కోవడం అని చెప్పారు. లాస్ ఎంజెలెస్ ఎందుకంటే.. అక్కడి వాతావరణం ముంబైకి దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడే స్థిరపడాలని చూస్తున్నాను అని అన్నారు.

Actress Priyanka Chopra wants give birth to baby

ఈ సందర్భంగా తనకు విదేశాల్లో స్థిరపడాలని ఉంది. ప్రస్తుతం స్కై ఈజ్ పింక్ సినిమా చేస్తున్నాను అని చెప్పారు. నా భర్తతో కాపురం సాజావుగా సాగుతున్నది. ఆయన పాట పాడుతుంటే చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ ఆయనతో కలిసి ఎన్నడూ పాట పాడటానికి ధైర్యం చేయను. కానీ అప్పుడప్పుడు ఇద్దరం కలిసి హమ్ చేస్తుంటాను అని ప్రియాంక అన్నారు.

సుమారు రెండేళ్ల క్రితం ప్రియాంక, నిక్ జోనస్ ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార వర్గాలు హాజరైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X