twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అటెన్షన్ కోసం ఆఖరికి ప్యాంట్ జిప్ తీసేసి.. ఫొటో షూట్ లో షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్

    |

    కొంతమంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటూ అగ్ర హీరోయిన్స్ గా కొనసాగుతూ ఉంటారు. మొదట ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోరు. ఇక విజయ్ దేవరకొండతో మొదటి సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న ఒక హీరోయిన్ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు. ఇక ఇటీవల ఆ బ్యూటీ ఒక ఫోటో షూట్ చేసిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏకంగా తన ప్యాంటు జిప్ తీసేసి ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఆ ఫోటోలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    విజయ్ తో ఫస్ట్ సినిమా

    విజయ్ తో ఫస్ట్ సినిమా

    చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకర్షించే ప్రియాంక జవాల్కర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ తర్వాత విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాలో మొదటి అవకాశం అందుకుంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ప్రియాంక పేరు అప్పుడే ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది.

     మొదట అక్కడ జాబ్ చేసి..

    మొదట అక్కడ జాబ్ చేసి..

    ప్రియాంక మొదట హీరోయిన్ కాకముందు ఐటి ఇండస్ట్రీలో జాబ్ కూడా చేసింది. కొన్నాళ్ళు ఆమె అమెరికాలో కూడా జాబ్ చేసింది. ఇక అక్కడే ఉంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవాలని కొన్ని స్పెషల్ ఫోటోషూట్స్ కూడా నిర్వహించింది. ఇక అక్కడ ఉండి లాభం లేదు అనుకొని మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చినపుడు హైదరాబాద్ లోనే ఉంటూ నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

    తొందరపడకుండా ఆలోచించింది

    తొందరపడకుండా ఆలోచించింది

    ఇక విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉండగా ఆమెకు టాక్సీవాలా సినిమాలో అవకాశం దొరికింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రియాంక పేరు కూడా వైరల్ గా మారిపోయింది. ఇక ఆమెకు అప్పుడే కొన్ని కమర్షియల్ సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి అనుకుని కొన్ని మీడియం రేంజ్ సినిమాలను వదులుకున్నట్లు కూడా ఆ మధ్య ఒక టాక్ వినిపించింది.

     రెండేళ్లు ఖాళీగా..

    రెండేళ్లు ఖాళీగా..

    టాక్సీవాలా సినిమా తర్వాత ఈ బ్యూటీ రెండేళ్లు ఖాళీగా ఉన్నప్పటికీ మంచి అవకాశాలను అందుకోవాలని అనుకుంది. ఇక ప్రియాంక గత ఏడాది సత్యదేవ్ తో తిమ్మరుసు అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరంతో ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా పరవాలేదు అనే విధంగా సక్సెస్ అయింది.

    ప్యాంట్ జిప్ తీసేసి స్టిల్

    ప్యాంట్ జిప్ తీసేసి స్టిల్

    ఇక అప్పుడప్పుడు ప్రియాంక సోషల్ మీడియాలో తన క్రేజ్ ను మరింత పెంచుకునేలా ఫోటోలకు స్టిల్స్ ఇస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఊహించని విధంగా జీన్స్ ప్యాంట్ లో ఫోటోషూట్ నిర్వహించింది. అమ్మడు జిప్ తీసేసినట్లుగా స్టిల్స్ చేసింది. ఇక నడుము అందాలు అలాగే ఎద అందాలు కూడా హైలైట్ అయ్యే విధంగా ఆమె ఇచ్చిన స్టిల్ పై ఓ వర్గం వారు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మంచి గ్లామరస్ హీరోయిన్ అని ఒక స్టార్ హీరోతో అవకాశం వస్తే తప్పకుండా ఆమె రేంజ్ పెరుగుతుంది అని కూడా మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ కి అలాంటి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

    English summary
    Actress Priyanka jawalkar beautiful glamorous pic viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X