twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Priyanka Jawalkar: తెలుగమ్మాయి మిల్కీ అందాలు.. చిన్న డ్రెస్ లో ఫస్ట్ టైమ్ ఇలా.. షాకింగ్!

    |

    చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్ బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. కెరీర్ స్టార్టింగ్ లోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయింది. హీరోయిన్ గా సరికొత్త కెరీర్ ను సెట్ చేసుకోవాలి అని ఎంతో ఇష్టాంగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక మొదట్లో కొన్ని ఇబ్బందులను దాటి అమ్మడు కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రియాంక గ్లామర్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలపై ఒక లుక్కేస్తే..

    జాబ్ వదిలేసి

    జాబ్ వదిలేసి

    ప్రియాంక జవాల్కర్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందిన అమ్మాయి. గ్రాడ్యుయేషన్ అనంతరం అమ్మడు కొన్నాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేసింది. అనంతరం అమెరికా వెళ్లి అక్కడ కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేసింది. ఇక ఎనిమిది నెలల తరువాత తనకు ఇష్టమైన సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని ప్రియాంక జాబ్ ను వదిలేసి మళ్ళీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది.

    విజయ్ తో ఫస్ట్ హిట్

    విజయ్ తో ఫస్ట్ హిట్

    ఇక ప్రియాంక మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఆమె చాలా సినిమాలకు సంబంధించిన ఆడిషన్స్ లో కూడా పాల్గొంది. కానీ మొదటి అవకాశం రావడానికి కొంత సమయం పట్టింది. ఇక 2017లో కలవరమాయే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

    మరో సక్సెస్

    మరో సక్సెస్

    టాక్సీవాలా సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియాంక తర్వాత కొన్ని చిన్న సినిమాల ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా రిస్క్ చేయలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలి అని కొన్ని ఆఫర్లను కూడా రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇక తిమ్మరుసు సినిమాలో చేసిన హీరోయిన్ పాత్ర బాగానే క్లిక్ అయింది. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

    గ్లామర్ షో

    గ్లామర్ షో

    అయితే 2021లో వరుసగా రెండు సినిమాలు సక్సెస్ అయినా కూడా ప్రియాంకకు మరో రేంజ్ లో అయితే ఆఫర్లు రాలేదు. ఈ బ్యూటీ చివరిగా గమనం అనే సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తరుణంలోనే ప్రియాంక తన గ్లామర్ షో తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

    చిన్న స్కట్ లో మిల్కీ అందాలు

    చిన్న స్కట్ లో మిల్కీ అందాలు

    గతంలోనే ప్రియాంక కొన్ని ఫ్యాషన్ డ్రెస్ లలో గ్లామర్ షో తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక రీసెంట్ గా అయితే అతి చిన్న స్కట్లో తన లెగ్స్ అందాలను చాలా అందంగా ప్రజెంట్ చేసింది. దీంతో నెటిజన్లు మిల్కీ బ్యూటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా మరొక ఫోటోలో ఎద అందాలను కూడా విభిన్నంగా హైలైట్ అయ్యేలా చేసింది.

    ఏదేమైనా కూడా ప్రియాంక గ్లామర్ షో తో మాత్రం సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. ఒక విధంగా గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా తెలుగమ్మాయిలు సిద్ధమే అని ఈ బ్యూటీ ఒక హింట్ అయితే ఇచ్చింది. మరి ఆ రూట్లో ఏమైనా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

    English summary
    Actress priyanka jawalkar latest stunning glamorous look viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X