Punarnavi Bhupalam: ఊహించని లుక్ లో తెలుగమ్మాయి.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
పదిహేడేళ్ల వయసులోనే వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన పునర్ణవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సినిమాల తోనే కాకుండా అలాగే బిగ్ బాస్ షో ద్వారా కూడా మంచి గుర్తింపు అందుకుంది. తెనాలికి చెందిన ఈ తెలుగమ్మాయి ఇటీవల హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు కూడా వెళ్లింది. ఇక సోషల్ మీడియాలో రోజుకో ఫోటో కూడా పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటో లో పునర్నవి ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఆమె కొంత చేంజ్ అయినట్లు అని పిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉయ్యాల జంపాల సినిమాలో..
పునర్నవి భూపాలం మొదట 2013లో ఉయ్యాల జంపాల అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఇక రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఉయ్యాల జంపాల సినిమా లో సైడ్ క్యారెక్టర్ లో పునర్నవి అచ్చమైన పల్లెటూరి పక్కింటి అమ్మాయి తరహాలో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది.

బిగ్ బాస్ లో గ్లామర్ రచ్చ
ఒక విధంగా ఉయ్యాల జంపాల సినిమాలో చూసినప్పుడు పునర్నవి ని అందరూ చాలా ట్రెడిషనల్ గానే ఉండే అమ్మాయి అనుకున్నారు. కానీ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆమె గ్లామర్ తో కూడా షాక్ ఇచ్చింది. విభిన్నమైన మోడ్రన్ స్టైల్ తో ఎంతగానో ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కూడా ఆమె కొనసాగించిన ట్రాక్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

లాండన్ లో అలా..
పునర్నవి భూపాలం రీసెంట్ గా హయ్యర్ స్టడీస్ కోసం లండన్ కి వెళ్లింది. అక్కడే బ్యూటీ గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన కోర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ అ తన లైఫ్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా అనే సోషల్ మీడియాలో చాలా ఓపెన్గానే షేర్ చేసుకుంటోంది.

షాకింగ్ లుక్
పునర్ణవి భూపాలం అక్కడి పద్ధతులకు కూడా చాలా బాగా అలవాటు పడినట్లు అర్థమవుతోంది పబ్బులకు పార్టీలకు తరచుగా వెళుతూ విదేశీ స్నేహితులతో కలిసి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇక పునర్నవి లుక్ విషయంలో అయితే పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె కాస్త చబ్బీగా మారినట్లు కూడా ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.

అతనితో లవ్..
ఇక స్టడీస్ ముగిసిన తర్వాత ఈ 26 ఏళ్ల తెలుగమ్మాయి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక తెలుగులో అయితే మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఎందుకో ఏమో, సైకిల్ అనే ఇలా పలు చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలలో కనిపించింది. అలాగే కమిట్మెంట్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది. ఆ వెబ్ సిరీస్ తో ఆమె చేసిన ప్రమోషన్స్ అంతా ఇంతా కాదు. అందులో నటించిన ఉద్భవ్ రఘునందన్ తో ఆమె ప్రేమలో ఉంది అని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సంచలన వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కూడా ప్రమోషన్స్ లో భాగమేనని ఆ తర్వాత అర్థమైంది.


Click it and Unblock the Notifications











