వాళ్లే చంపేశారు.. దానిని సెక్స్ సినిమాగా మార్చారు.. అలాంటివి చేయను.. రాయ్ లక్ష్మీ
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ ఒకరు. తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో సత్తా చాటిన తర్వాత జూలీ1 సినిమాతో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ఆ సినిమా ఫెయిల్యూర్ గురించి తన అభిప్రాయాలను పంచుకొన్నారు. రాయ్ లక్ష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

నాలో మార్పు రాలేదు
జూలీ2 సినిమా పరాజయం తర్వాత సినిమా ఎంపికలో నాలో ఎలాంటి మార్పు రాలేదు. నా కెరీర్‌లో నాకు ఓ కొత్త జోనర్. కాకపోతే విడుదలకు ముందు భారీగా హైప్ వచ్చింది. జూలీ2 టీజర్ ప్రేక్షకులను తప్పుదారి పట్టించేలా ఉండటమే బాక్సాఫీస్ వద్ద పరాజయానికి ప్రధాన కారణం.

టీజర్‌లో సెక్స్ సినిమా అనే ఫీలింగ్‌ను
జూలీ2 సినిమా హృదయాన్ని కదిలించే కథతో ఆ సినిమా రూపొందింది. కాకపోతే టీజర్, ట్రైలర్లలో సెక్స్ చిత్రమనే విధంగా ఫీలింగ్ కల్పించారు. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్, అమ్మాయిలు సినిమా చూడటానికి రాలేదు. జూలీ2 సినిమా ఫ్లాప్ కావడానికి మొదటి కారణం నిర్మాతలే. ఆ సినిమాను తప్పుడు రితీలో ప్రమోట్ చేశారు.

జూలీ2తో నిరాశ చెందాను
జూలీ2 సినిమా టీజర్లు, ట్రైలర్లలో తప్ప సినిమాలో అలాంటి సీన్లు లేకపోవడం ఆడియెన్స్‌ను నిరాశపరిచింది. సినిమాలో నటించడం తప్పా ప్రమోషన్, ఇతర అంశాలు మన చేతుల్లో ఉండదు. కొన్ని మంచి సినిమాలు ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ జూలీ2 సినిమాతో చాలా నిరాశచెందాను.

సరైన రితీలో ప్రమోట్ చేసి ఉంటే
జూలీ2 సినిమాను సరైన రీతిలో ప్రమోట్ చేస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చేవారు. సినిమాకు మంచి ఆదరణ లభించేది. నా అసంతృప్తిని, నిర్మాతల తీరుపై మీడియాలో బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశాను. మంచి సినిమాను వాళ్లే చంపేశారనే ఫీలింగ్ ఏర్పడింది.

అలాంటి పాత్రలే చేయమని అడిగితే
జూలీ2 సినిమా తర్వాత బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ జూలీ సినిమాలో మాదిరిగా చేసిన రోల్స్ చేయమని అడుగుతున్నారు. అందుకే నేను ఒప్పుకోవడం లేదు. ఎవరైనా ఒక పాత్రలో నటిస్తే అలాంటి పాత్రలనే బాలీవుడ్ నిర్మాతలు ఇచ్చే సమస్య ఉంది. బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్ర పరిశ్రమ మంచిది. అక్కడ చాలా లేటుగా సినిమాలు తీస్తారు. సినిమా ప్రాసెస్ చాలా సుదీర్ఘంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











