ఓ స్త్రీ ఎంతమందితో రిలేషన్ పెట్టుకొంటుంది చెప్పండి...గర్భవతి వార్తలపై రాయ్ లక్ష్మీ రియాక్షన్!
Recommended Video
సినీ తారలపై రూమర్లు రావడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారింది. హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ అందుకు మినహాయింపు కాదు. ఇటీవల తనపై వస్తున్న రూమర్లు, సోషల్ మీడియాలో ఎదురవుతున్న ట్రోల్‌పై గట్టిగా స్పందించారు. తెలుగు సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి అనేక విషయాలు మీడియాతో మట్లాడారు. బాలీవుడ్ సినిమాలు ఇతర కారణాల వల్ల తాను టాలీవుడ్‌కు అందుబాటులో లేకపోయానని వివరణ ఇచ్చారు. రాయ్ లక్ష్మీ ఏమన్నారంటే..

స్సెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా
హీరోయిన్ పాత్రలకంటే స్పెషల్ పాటల్లోనే ఎక్కువగా నటిస్తాననే విమర్శ నాకు కూడా వినిపించింది. సినిమాలో రెండున్నర గంటలు కనిపించినా.. లభించని క్రేజ్ కేవలం ఐదు నిమిషాలు ఉంటే స్పెషల్ సాంగ్స్‌తోనే వస్తున్నది. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ పారితోషికంగా గుర్తింపు రావడం వల్ల కొన్ని స్పెషల్ సాంగ్స్ చేయాల్సి వస్తున్నది.

చెప్పేది ఒకటి.. మూవీలో చూపించేదొకటి
కొన్ని మంచి పాత్రలు, సినిమాల్లో నటించినా గుర్తింపు రాకపోవడం చాలా బాధగా ఉంటుంది. హిందీలో చాలా కష్టపడి జూలీ2 సినిమా చేశాను. నాకు చెప్పిన కథ వేరు. సినిమాలో చూపించింది వేరు. అంతేకాకుండా వాంప్ క్యారెక్టర్‌గా చూపించడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో నేను చేసేది ఏమీ ఉండదు అని రాయ్ లక్ష్మీ అన్నారు.

రూమర్లు, ట్రోల్స్‌తో విసిగిపోయా
నాపై భారీగా రూమర్లు మీడియాలో కనిపిస్తాయి. సోషల్ మీడియాలోనైతే దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నేను గర్భవతిని అనే గాసిప్స్ ప్రచారం చేశారు. అనేక మందితో రిలేషన్స్ అంటగట్టారు. ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకొంటుందా? వాస్తవాలు లేకుండా నాపై దారుణంగా రూమర్లను ప్రచారం చేస్తుంటారు అని రాయ్ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.

నా జీవితంలో అఫైర్స్
నా జీవితంలో ప్రస్తుతం అఫైర్స్‌కు స్థానం లేదు. ప్రేమ పేరుతో మూడు సార్లు మోసపోయాను. ప్రేమ విషయంలో నా తప్పులు తెలుసుకొన్న తర్వాత నా రిలేషన్స్ అన్నింటినీ తెంచేసుకొన్నాను. ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాను. మంచి పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను మెప్పించాలని అనుకొంటున్నాను.

బికినీ ధరిస్తే తప్పయితే ఎలా?
నాకు ఖాళీ సమయం ఉన్నప్పుడు వెకేషన్స్‌కు వెళ్తాను. ప్రాంతాన్ని బట్టి నా దుస్తుల విషయంలో అభిరుచులు మారుతుంటాయి. ఇటీవల వెకేషన్స్ సందర్భంగా బికినీ ధరిస్తే దారుణంగా ట్రోల్ చేశారు. నాకు నచ్చిన రితీలో దుస్తులు ధరిస్తాను. ఎవరికైనా నచ్చకపోతే కళ్లు మూసుకోమని సలహా ఇస్తాను. అంతేకాని ఒకరి వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయవద్దని కోరుతాను అని రాయ్ లక్ష్మీ తెలిపారు.


Click it and Unblock the Notifications











