టెంప్ట్ చేసేలా లక్ష్మీ రాయ్ ఎక్స్‌పోజింగ్: జాకెట్ ఉన్నా లేనట్లే ఘోరంగా!

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, అప్పుడప్పుడూ బోల్డు షోతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటిన హీరోయిన్ లక్ష్మీ రాయ్. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. గుర్తింపును మాత్రం అంతగా అందుకోలేకపోయింది. ఫలితంగా టాలీవుడ్‌కు దూరం అయింది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం యమ హైలైట్ అయింది. ఇక, ఇప్పుడు కూడా చాలా భాషల్లో వరుస సినిమాలు చేస్తోన్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా లక్ష్మీ రాయ్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. సక్సెస్ కాలేదు: కన్నడ భామ లక్ష్మీ రాయ్ చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేదు. ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమాలో మాత్రమే చేసింది. వీటి వల్ల లక్ష్మీకి సక్సెస్ మాత్రం దరి చేరలేదు.

 Raai Laxmi

బాలీవుడ్‌లో మాత్రం సందడి: తెలుగులో రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లి.. 'జూలీ 2'లో హాట్ ట్రీట్ ఇచ్చి అందాల ఆరబోతతో సంచలనం అయింది.

రీఎంట్రీ... మెగా హీరోలతోనే: ఆరంభంలోనే టాలీవుడ్ మూవీలకు గ్యాప్ ఇచ్చిన రాయ్ లక్ష్మీ.. నందమూరి బాలకృష్ణ 'అధినాయకుడు'తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌‌లో మెరిసింది.

 Raai Laxmi

ఇప్పుడూ వరుస సినిమాలు: రాయ్ లక్ష్మీ గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. ఇప్పుడు కూడా ఎంతో బిజీగా సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'ఆనంద భైరవి' అనే సినిమాలో నటించింది. అలాగే, కన్నడంతో 'ఝాన్నీ ఐపీఎస్', తమిళంలో 'గ్యాంగ్‌స్టర్', మలయాళంలో 'మాన్‌స్టర్' వంటి చిత్రాలు చేసింది. ఈ ఏడాది 'భోళా'లో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

సోషల్ మీడియాలో హల్చల్: బోల్డు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ సినిమాలు చేసినా చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే చాలా కాలంగా తన కెరీర్‌ గురించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమె తన క్రేజ్ పెంచుకుంటోంది.

 Raai Laxmi

హాట్ డోస్ పెంచుతూ రచ్చ: కెరీర్ ఆరంభంలోనే గ్లామర్ షోకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని రాయ్ లక్ష్మీ.. బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీ బోల్డు షోతో సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా తన ఘాటు అందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తుంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

 Raai Laxmi

చీరలోనూ ఘాటు ఫోజులతో: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాయ్ లక్ష్మీ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చీరలో స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి ఘాటుగా ఫోజులిచ్చింది. అంతేకాదు, ఆ బ్లౌజ్ నుంచి క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలను విపరీతంగా చూపిస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X