For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  |

  చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. మెస్మరైజ్ చేసే నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అప్పటి నుంచి వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. మన ఇండస్ట్రీలోనే కాదు.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తన హవాను చూపిస్తోంది.

  ఇలా చాలా కాలంగా సత్తా చాటుతోన్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం దాదాపు ఆరేడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఢిల్లీ బ్యూటీ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఆలస్యం చేయకుండా దాన్ని చూసేయండి మరి!

  అలా మొదలైన కెరీర్.. తెలుగులోకి ఇలా

  అలా మొదలైన కెరీర్.. తెలుగులోకి ఇలా

  చదువుకునే రోజుల్లోనే ‘మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో సినీ ప్రపంచంలోకి ప్రవేశించింది రాశీ ఖన్నా. అందులో అదిరిపోయే నటనతో అందరి దృష్టిని ఆకర్షించిందీ బ్యూటీ. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే బడా హీరోల సినిమాల్లో సైతం నటించింది. ఇలా చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  అన్ని చోట్లా కనిపిస్తూ.. సందడి చేస్తోంది

  అన్ని చోట్లా కనిపిస్తూ.. సందడి చేస్తోంది

  బాలీవుడ్ మూవీతో నటిగా పరిచయమై.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్థిరపడిపోయింది రాశీ ఖన్నా. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘విలన్' అనే మూవీతో మలయాళం పరిశ్రమలోకి, ‘ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆయా భాషల్లో సైతం అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అక్కడ కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో దక్షిణాది స్టార్‌గా మారిపోయింది. హీరోయిన్‌గానే కాదు.. సింగర్‌గానూ సత్తా చాటిన ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో పాటలను ఆలపించింది. ఇలా సినీ ప్రపంచంలో ద్విపాత్రాభినయం చేస్తోంది.

  ఫుల్ ఫామ్‌లో రాశీ... అది బ్రేక్ వేసేసింది

  ఫుల్ ఫామ్‌లో రాశీ... అది బ్రేక్ వేసేసింది

  కెరీర్ ఆరంభంలోనే రాశీ ఖన్నా తన టాలెంట్‌ను నిరూపించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఆరంభంలో గ్లామరస్ పాత్రలను చేసిన ఈమె.. ఈ మధ్య కాలంలో పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది.

  ఇక, చివరిగా విక్టరీ వెంకటేష్ - నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘వెంకీ మామ'తో పాటు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుందామె. ఈ విజయ పరంపరకు విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్' బ్రేక్ వేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది.

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ

  ఎక్కడ చూసినా ఆమెనే... అందులోనూ

  ఎక్కడ చూసినా ఆమెనే... అందులోనూ

  ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. తెలుగులో ఇప్పటికే నాగ చైతన్యతో కలిసి ‘థ్యాంక్యూ' అనే సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు గోపీచంద్ - మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘పక్కా కమర్షియల్'లో హీరోయిన్‌గా చేస్తోంది. అయితే, తమిళంలో మాత్రం ‘తుగ్లక్ దర్బార్', ‘అరన్మనై 3', ‘మేథావి', ‘సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో ‘బ్రహ్మమ్' అనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు ‘ద ఫ్యామిలీ మ్యాన్' ఫేం రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌తో రాశీ ఖన్నా డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది.

  రాశీ ఖన్నా స్పీడుకు సినీ పెద్దలు షాక్

  రాశీ ఖన్నా స్పీడుకు సినీ పెద్దలు షాక్

  రాశీ ఖన్నా గతంలో ఎన్నడూ చూడనంత బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో నాలుగు చిత్రాలు, మలయాళంలో ఒక మూవీ చేస్తోందామె. అదే సమయంలో ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. మొత్తంగా కొన్ని రోజులు హైదరాబాద్‌లో, మరికొన్ని రోజులు చెన్నైలో, ముంబైలో ఉంటూ రచ్చ చేస్తోంది. ఇలా ఏ హీరోయిన్‌కూ సాధ్యం కాని విధంగా ఏక కాలంలో ఇన్ని ప్రాజెక్టులు చేస్తూ అందరికీ షాకిస్తోందీ బ్యూటీ. ఆమె పని చేస్తున్న తీరును చూసి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  సెక్స్ లేకుండా ఉండలేవా: శృతి హాసన్‌కు నెటిజన్ సూటి ప్రశ్న.. చీకట్లో ఉంటే అంటూ షాకింగ్ ఆన్సర్!

  అందులో మాత్రం ఎప్పుడూ సందడి చేసి

  అందులో మాత్రం ఎప్పుడూ సందడి చేసి

  వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే రాశీ ఖన్నాను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

  Raashi Khanna Shocking Decision On Telugu Cinema
  టాప్ యాంగిల్ సెల్ఫీతో రాశీ ఖన్నా రచ్చ

  టాప్ యాంగిల్ సెల్ఫీతో రాశీ ఖన్నా రచ్చ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాశీ ఖన్నా తనకు సంబంధించిన అప్‌డేట్లను తరచూ వెల్లడిస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె టాప్ యాంగిల్‌తో సెల్ఫీ తీసుకోవడంతో ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత రాశీ ఖన్నా ఇంత హాట్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ‘మళ్లీ ముంబై వచ్చాను' అని ఈ పిక్‌కు క్యాప్షన్ పెట్టింది. ఇదిలా ఉండగా.. రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ స్పందన వస్తోంది. దీంతో ఇది తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Star Heroine Raashi Khanna Now Doing Few Films At a Time. She Is Very Active in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X