పవన్ కళ్యాణ్ వాళ్లకు దేవుడే. .రాశి ఖన్నా ఎమోషనల్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే అతన్ని ఉన్నతంగా ప్రేక్షకులకు పరిచయం చేసింది. అలాగే..పవర్ స్టార్ నటన, డ్యాన్సులతో ట్రెండ్ క్రియేట్ చేశారు. అలా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వర్డల్ వైడ్ గా ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో రాణిస్తున్నారు. పదేండ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎన్నికల్లో విజయదుంధుబీ మోగించి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు సహా తన రాజకీయ పనుల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి పవర్ స్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా.
అసలేం జరిగిందంటే? హీరోయిన్ రాశీ ఖన్నా .. 'ది సబర్మతీ రిపోర్ట్ (The Sabarmati Report).'సినిమాతో నవంబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో 12 ఫెయిల్ సినిమాతో సూపర్ హిట్ అందుున్న విక్రాంత్ మాస్సే ఈ సినిమాకు హీరోగా నటించారు. ఈ మూవీ పాజిటివ్ అందుకుని సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాశీ ఖన్నా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా. అలాగే.. సౌత్ ఇండియన్ స్టార్స్, ఫ్యాన్స్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

రాశీ మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తన అభిమానులు దేవుడిలా ఆరాధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే.. సౌత్ లో ప్రతి హీరోకు ప్రత్యేక స్టార్ డమ్ ఉంటుంది. అక్కడ హీరోలని దేవుడి లాగా కొలుస్తారు అభిమానులు. వారి సినిమాలు విడుదల అయితే పండగా చేసుకుంటారు. ఆ స్టార్ డమ్ ను బేస్ చేసుకుని మూవీ డైరెక్టర్స్ సినిమాలను తీస్తారు. ఒకప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ సినిమా విడుదల కు సందడి కనిపించేది. కానీ, ప్రస్తుతం అలాంటి కల్చర్ బాలీవుడ్ లో లేదు.' అన్నారు,.
'సౌత్ లో తమ అభిమాన నటుల సినిమాలు విడుదలయితే.. పండుగ లాగా సెలబ్రేట్ చేస్తారు. స్టూడెంట్స్ బంకులు కొట్టి.. మరి సినిమాలకు వెళ్తారని వెళ్తారు. వారికి ఆ రోజు ఏలాంటి పనులు ఉన్నా.. పక్కన పెట్టేసి సినిమాను చూస్తారు. సినిమా షూటింగ్స్ లో కూడా అలాంటి సందడే కనిపిస్తోంది. ఇక బడా హీరోల సినిమా విడుదల అయితే.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కచ్చితంగా సినిమా చూసి తీరుతారు. సౌత్ ఇండియన్ కు సినిమా అంటే పిచ్చి. ఓటీటీ లో రిలీజ్ అవుతాయని తెలిసినా కూడా వారి అభిమాన నటుల సినిమాలను థియేటర్లలోనే ఎక్స్పీరియన్స్ చేస్తారు.
నిజంగా వాళ్లకు సినిమాలు అంటే పిచ్చి.. హై ప్రొఫెషన్స్, ఐటి ఎంప్లాయిస్ కూడా తమ ఫేవరెట్ హీరో సినిమా విడుదల అయితే లీవ్ పెట్టి మరి సినిమా చూస్తారు. వారు సినిమాలను ఎంతగానో ఆదరిస్తారు.' అని రాశీ ఖన్నా చెప్పుకోచ్చారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











