అందాలకు అడ్డు తీసేసిన రాశీ ఖన్నా: తొంగి చూస్తున్న పరువాలతో ఘాటుగా!
అందానికి అందం.. నటనకు నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేసేలా తనదైన చిత్రాలను చేసుకుంటూ వెళ్తోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. సాదాసీదాగానే హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేషనల్ రేంజ్‌లో సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో రాశీ ఖన్నా ఉత్సాహంగా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
చిన్న వయసులోనే స్టార్ట్:చిన్న వయసులోనే రాశీ ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే బాలీవుడ్ చిత్రంతో నటిగా వచ్చింది. తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'ఊహలు గుసగుసలాడే'తో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ మూవీలో అందంతో మెప్పించిన ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుంది. ఇక, ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమెకు మంచి ఆరంభం దక్కింది. అలాగే, రాశీ స్టార్‌గానూ ఎదిగింది.

అక్కడ కూడా స్టార్‌డమ్:హీరోయిన్‌గా మంచి ఎంట్రీని అందుకున్న రాశీ ఖన్నా.. ఆ తర్వాత వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది. దీంతో స్టార్‌డమ్‌ను సైతం అందుకుంది. ఈ క్రమంలోనే 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళంలోకి కూడా ఎంటరైంది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది అవకాశాలను దక్కించుకుని నేషనల్ రేంజ్‌లో క్రేజ్ అందుకుంది.
ఎన్నో చిత్రాలు.. ఫ్లాపులే:వరుస సినిమాలతో సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది. కానీ, ఈ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఆమెకు భారీ షాక్‌లే తగిలాయి. అయినా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాల్లో నటించి బాగానే అలరించింది.

ఇప్పుడా మూవీలు చేస్తూ:వచ్చిన ప్రతి అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోన్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో మాత్రం పెద్దగా ప్రాజెక్టులను మాత్రం చేయడం లేదనే చెప్పాలి. దీంతో ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క మూవీ కూడా లేదు. కానీ, హిందీలో మాత్రం ఈ ముద్దుగుమ్మ 'యోధ' అనే సినిమాలో నటించింది. అలాగే, తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలను చేస్తోంది.

అందులో ఉత్సాహంగా:రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో ఉత్సాహంగా గడుపుతోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ సాగిపోతోంది.

గ్లామర్ డోస్ పెంచేస్తూ:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం ట్రెండింగ్‌లో ఉండడంతో పాటు తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోంది.

రాశీ బోల్డ్ పిక్స్ వైరల్:స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె పరువాలు మొత్తం విపరీతంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











