పాపం హీరోయిన్ రాశి.. అనుకున్న హీరో ఒక్కరూ.. సెట్స్‌లో మరొకరు..

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఏలిన నటి రాశి (Raasi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె, బాలనటిగా అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి వరుస విజయాలతో అగ్రనటిగా ఎదిగి, తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన రాశి, ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ బిజీగా మారుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త తరహా పాత్రలు పోషిస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఈ వెంట్ లో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న ఓ వింత అనుభవం గురించి వెల్లడించింది. ఇంతకీ ఏమైందంటే?

హీరోయిన్ రాశి సెకండ్ ఇన్నింగ్ కూడా జోరుగా సాగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన రాశి, తాజాగా విడుదలైన పాపం ప్రతాప్ (Papam Prathap) సినిమాలో కీలక పాత్రలో నటించి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటున్నారు. ఏప్రిల్ 17న విడుదలైన ఈ చిత్రంలో హీరోగా తిరువీర్ (Tiruveer) నటించగా, హీరోయిన్‌గా పాయల్ పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) కనిపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రాశి నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పోషించిన తల్లి పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Actress Raasi Funny Confusion with Ajay Ghosh on Papam Prathap Sets Goes Viral

ఈ నేపథ్యంలో పాపం ప్రతాప్ మూవీ యూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ సినిమాలో హీరో తిరువీర్ తల్లిగా, అలాగే అజయ్ ఘోష్ భార్య పాత్రలో రాశి కనిపించారు. కథలో భావోద్వేగ బరువు ఉన్న పాత్రను ఆమె పోషించగా, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా తల్లి భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానం సినిమాకి హైలైట్‌గా నిలిచిందని చెప్పబడుతోంది. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన రాశి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి అజయ్ ఘోష్ భార్య పాత్ర చేయడం కొందరికి ఆశ్చర్యంగా అనిపించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి.

ఈ సందర్భంగా రాశి తన పాత్రతో పాటు షూటింగ్ మొదటి రోజు జరిగిన ఒక సరదా సంఘటనను పంచుకున్నారు. దర్శకుడు కథ చెప్పిన సమయంలో "అజయ్ ఘోష్" అనే పేరు వినగానే, తాను మరో యంగ్ హీరో అజయ్‌ను ఊహించినట్లు చెప్పారు. ఆ కారణంగా ఎలాంటి సందేహం లేకుండా సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పారు. ఇంకా, ఆయన వయసు కూడా తక్కువగానే ఉంటుందని భావించి, మొదటి రోజు షూటింగ్‌కి తాను హీరోయిన్‌లా రెడీ, జడ వేసుకుని, యంగ్ లుక్‌లో సెట్స్‌కి వెళ్లినట్టు వివరించారు.

కానీ సెట్స్‌కి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రాశి నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. అక్కడ అజయ్ ఘోష్‌ను చూసి, "ఇవ్వరా మన మామయ్య పాత్ర చేసే ఆర్టిస్ట్ అయి ఉంటారు" అని అనుకున్నాను. కొద్దిసేపటికి యూనిట్‌లోని ఓ సభ్యుడు ఆయనే అజయ్ ఘోష్ అని చెప్పడంతో అసలు విషయం తెలిసిందని, ఆ క్షణంలో తాను పూర్తిగా షాక్ అయ్యానని అన్నారు. దర్శకుడిని అడిగితే, కథ ప్రకారం చిన్న వయసులోనే పెళ్లి అయిన జంటగా ఈ పాత్రలు ఉంటాయని చెప్పారని వివరించారు.

అంతేకాదు, సెట్స్‌లో తన లుక్ చూసి "మీరు హీరోయిన్‌లా ఉన్నారు, తల్లి పాత్ర కనిపించడం లేదు" అని చెప్పడంతో, మేకోవర్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తర్వాత జడ ముడి వేసుకుని, తల్లి పాత్రకు తగ్గట్టు లుక్ మార్చుకున్నానని చెప్పారు. ఈ మొత్తం సంఘటన యూనిట్‌లో నవ్వులు పూయించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక అజయ్ ఘోష్ గురించి మాట్లాడుతూ, ఆయన ఒక అద్భుతమైన నటుడని రాశి ప్రశంసించారు. సింగిల్ టేక్‌లోనే సీన్లు పూర్తి చేసే నైపుణ్యం ఆయనకు ఉందని, డైలాగ్స్‌కు కొత్త కొత్త ఇంప్రవైజ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ హిలేరియస్‌గా ఉంటుందని కొనియాడారు.

సినిమా గురించి మాట్లాడిన రాశి 'ఒకప్పుడు 'ప్రేయసిరావే' అబ్బాయిలకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు 'పాపం ప్రతాప్' అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అవుతోంది. నేను నా కూతురితో కలిసి ఈ సినిమా చూసాను. ఆమె 'పాపం ప్రతాప్ 2 ఎప్పుడు వస్తుంది?' అని అడిగింది. ఇలా రాశి అనుకున్న నటుడు ఒక్కరూ.. సెట్స్ లో ఉన్న నటుడు మరోకరూ కావడంతో నెటిజన్లు పాపం రాశి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో, రాశి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా నటిగా ఎలా తన సత్తా చాటుకుంటున్నారో ఈ సినిమా మరోసారి నిరూపించింది.

Read more about: ajay ghosh raasi tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X