డైరెక్టర్ తేజ నా జీవితం నాశనం చేశాడు.. సీనియర్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ను అందుకున్న వారు ఎందరో. ఈ కోవలోకే వస్తారు రాశి. ముద్దుగా, బొద్దుగా ఉండే రాశి 90వ దశకంలో దక్షిణాదిన అగ్రకథానాయికగా వెలుగొందారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100 చిత్రాల వరకు నటించారు. రాశి అసలు పేరు రవళి.. కానీ వెండితెరకు విజయలక్ష్మీగా పరిచయమయ్యారు. రాశి తాత చెన్నైలో సినిమాలకు జూనియర్ ఆర్టిస్టులను సప్లయ్ చేసే ఏజెంట్‌గా పనిచేసేవారట. రాశికి అన్నయ్య ఉన్నారు.. ఆయన బిజినెస్ చేస్తారట. ఆమె 10వ తరగతి వరకు చదువుకుని, హీరోయిన్‌గా మారిన తర్వాత బీఏ లిటరేచర్ చేశారు.

ఇక రాశి బాలనటిగా రావు గారి ఇల్లు, బాల గోపాలుడు, చెట్టు కింద ప్లీడర్, ఆదిత్య 369 , పల్నాటి పౌరుషం సినిమాల్లో నటించారు. తమిళంలో ప్రియం చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. పెళ్లిపందరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు , పండుగ, డాడి డాడీ, స్వప్నలోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు, సముద్రం, ప్రేయసి రావె, పోస్ట్‌మన్, మూడు ముక్కలాట వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించారు. 2000 సంవత్సరం ఆరంభం వరకు రాశికి బాగానే అవకాశాలు వచ్చాయి. అయితే యువ నటీనటులు అప్పుడప్పుడే పరిశ్రమలో ఎంట్రీ ఇస్తుండటంతో రాశికి ఛాన్సులు తగ్గాయి. ఈ నేపథ్యంలో 2005లో శ్రీ ముని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. పెళ్లి, పిల్లలతో వైవాహిక జీవితాన్ని ఏంజాయ్ చేస్తున్న రాశి మధ్యలో బ్రేక్ ఇచ్చారు.

actress raasi made sensational comments on nijam movie behind scenes

అయితే తన తరం నటీనటులు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో రాశి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఒన్‌బాధలే గురు చిత్రంలో నటించారు. ఆ వెంటనే తెలుగులోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కళ్యాణ వైభోగమే, పడేశావే, ఆకతాయి, లంక చిత్రాల్లో తల్లి క్యారెక్టర్లు కూడా చేశారు. మరోవైపు బుల్లితెరపైనా అడుగుపెట్టి గిరిజ కళ్యాణం, జానకి కలగనలేదు సీరియల్స్‌లో నటించారు. సముద్రం, వీడే, వెంకీ సినిమాలలో ఐటెం సాంగ్స్‌తోనూ అలరించారు.

ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న రాశి.. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ తన కెరీర్ ఇలా కావడానికి ఓ సినిమాలో వేసిన క్యారెక్టరే కారణమన్నారు. అది మరే సినిమానో కాదు.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన నిజం. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని.. ఇందులో గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాశి చెప్పారు. దర్శకుడు తేజ .. నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి , చూపించింది మరొకటన్నారు.

actress raasi made sensational comments on nijam movie behind scenes

మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని .. షూటింగ్ మొదలైన తొలిరోజే స్పాట్‌ నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడినా .. కొంతమంది అభిమానులు మాత్రం తనను అలాంటి సీన్స్‌లో చూసి ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలకు తాను దూరం కావాలి అనుకున్నానే తప్పించి, సినిమాలు తనని వద్దు అనుకోలేదని రాశి తెలిపారు. ప్రస్తుతం రాశి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: raasi nijam movie director teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X