‘ఆ ఒక్క కారణంతో.. అరుంధతిలో అనుష్క పాత్ర మిస్సైంది'

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం హిట్‌లు కాదు.. ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తాయి. అలాంటి సినిమాల్లో ముందువరుసలో నిలిచేది అరుంధతి.2009లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ, హీరోయిన్‌ ఆధారంగా కూడా భారీ విజయాన్ని సాధించవచ్చని నిరూపించింది. ముఖ్యంగా జేజమ్మ పాత్రలో అనుష్క శెట్టి ( Anushka Shetty) చేసిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఈ పాత్ర కోసం మొదట అనుష్కను ఎంపిక చేయలేదు అనేది చాలా మందికి తెలియని విషయం. ఈ అయితే, ఓ హీరోయిన్ ఓ కారణం వల్ల ఈ మూవీ అవకాశం కోల్పోయిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

అరుంధతి దర్శకుడు కోడిరామకృష్ణ (Kodi Ramakrishna)తన మనసులో ముందుగా మరో ముగ్గురు హీరోయిన్లను ఊహించుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. వారిలో మమతా మోహన్ దాస్, ప్రేమ, అలాగే రాశి పేర్లు ఉన్నాయి. మొదటగా మమతా మోహన్ దాస్‌ను సంప్రదించగా, ఈ సినిమా చేయడం వల్ల కెరీర్‌కు నష్టం జరుగుతుందని కొందరు చెప్పడంతో ఆమె ఆ ఆఫర్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రేమకు డేట్స్ సమస్య రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పాల్సి వచ్చింది. దీంతో దర్శకుడి దృష్టి రాశీపై పడింది.

Actress Raasi Missed Arundhati Role Due to Marriage Anushka Shetty Career Turning Point

అప్పటికి రాశీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన నటి. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, తరువాత హీరోయిన్‌గా కూడా విజయవంతంగా కొనసాగింది. ముఖ్యంగా కోడిరామకృష్ణతో ఆమెకు ఉన్న అనుబంధం ప్రత్యేకం. చిన్నప్పటి నుంచే ఆయన సినిమాల్లో నటించిన రాశీ, ఆయనను కుటుంబ సభ్యుడిలా భావించేదట. అందుకే ఆమె ఆయనను 'అంకుల్' అని పిలిచేదని కూడా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ, 'అరుంధతి' గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'జేజమ్మ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాత్ర నేను చేసి ఉంటే బాగుండేదనిపించింది' అంటూ ఆమె భావోద్వేగంగా చెప్పింది. అంతేకాదు, ఒకసారి కోడిరామకృష్ణను నేరుగా అడిగానని కూడా తెలిపింది. 'నన్నెందుకు తీసుకోలేదు?' అని ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచిందట. 'నిన్ను ఎవరు అంత త్వరగా పెళ్లి చేసుకోమన్నారు? నీ పెళ్లే కారణం,' అని నవ్వుతూ చెప్పారట. ఈ మాటలోనే అసలు కారణం దాగి ఉందని రాశీ పేర్కొంది.

అప్పటికే రాశీ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టడంతో, ఈ భారీ ప్రాజెక్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా దర్శకుడు కొత్త ఎంపికగా అనుష్కను తీసుకున్నారు. ఆ నిర్ణయం చివరికి ఇండస్ట్రీ చరిత్రలో ఒక మైలురాయిగా మారింది. సుమారు 13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'అరుంధతి', విడుదల తర్వాత 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. స్టార్ హీరో లేకుండా, పూర్తిగా మహిళా ప్రధాన కథతో ఇంతటి విజయాన్ని సాధించడం అప్పట్లో అరుదైన విషయం. ఈ సినిమా అనుష్క కెరీర్‌ను పూర్తిగా మార్చేసి, ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా నిలబెట్టింది.

మరోవైపు.. ఈ అవకాశం మిస్ కావడం రాశీ కెరీర్‌పై ప్రభావం చూపిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ రాశీ 'అరుంధతి'లో నటించి ఉంటే, ఆమె కెరీర్ పూర్తిగా వేరే దిశలో వెళ్లేదని చెబుతున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన రాశీ, తరువాత రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. 'నిజం' వంటి సినిమాలతో తిరిగి ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు రాలేదు. తరువాత బుల్లితెర వైపు మళ్లి, 'జానకి కలగనలేదు' వంటి సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు, టీవీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అరుంధతి జేజమ్మగా రాశీ కనిపించి ఉంటే ఎలా ఉండేదో? అనేది ఆసక్తిగా మారింది.

Read more about: rashi anushka shetty arundhati
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X