రాధిక ఆప్టే తొడపై టాటూ... చాలా మందికి తెలియని రహస్యం!
కాస్మోపాలిటన్ బ్యూటీ అవార్డ్స్ 2019 వేడుక ముంబైలో మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాధిక ఆప్టే రెడ్ కార్పెట్ అప్పియరెన్స్‌లో తన బోల్డ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన షీర్ థై-హై స్లిట్ సిల్వర్ గౌను ధరించింది.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ గౌను ధరించిన ఆమె రెడ్ కార్పెట్ అప్పియరెన్స్ ఇస్తుండగా అందరి దృష్టి ఆమె తొడపై ఉన్న టాటూ వైపు మళ్లింది. సెక్సీ స్పాట్లో ఉన్న ఈ పచ్చబొట్టును ఇన్నాళ్లు కనిపించకుండా దాచిన రాధిక ఈ వేడుకలో అది బహిర్గంతం అయ్యేలా చేసింది.

‘బి’ టాటూ వెనక రహస్యం ఇదే..
రాధిక తన తొడపై వేయించుకున్న ‘బి' టాటూ వెనక రహస్యం ఆమె భర్త బెనడిక్ట్ టేలర్. అతడి గుర్తుగా ఆమె ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇది ఎక్స్ ఫోజ్ అయ్యేలా డ్రెస్ డిజైన్ చేయడంతో ఆమె రెడ్ కార్పెట్ అప్పియరెన్స్ ఇస్తుంటే అందరి దృష్టి అటు వైపు మళ్లింది.

రాధిక-బెనడిక్ట్ ప్రేమ వివాహం
లండన్‌కు చెందిన మ్యూజీషియన్ బెనడిక్ట్ టేలర్‌తో రాధిక ఆప్టే వివాహం 2012లో జరిగింది. అయిత చాలా కాలం వరకు ఈ విషయం రహస్యంగానే ఉంచారు. రాధిక ఇండియాలో ఉంటూ తన సినిమా కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ... ప్రతి నెలలో ఇద్దరూ కొన్ని రోజులు తప్పకుండా కలిసి గడుపుతారట. ఇటు వృత్తి, అటు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ జీవితం సాగిస్తున్నారు.

అలా ఇద్దరి మధ్య పరిచయం
2011లో రాధిక ఆప్టే డ్యాన్స్ నేర్చుకోవడానికి లండన్‌కు వెళ్లింది. ఆ సందర్భంగా ఆమెకు టేలర్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. ఇద్దరూ ఒక కమిట్మెంటుతో పెళ్లి చేసుకుని వృత్తి పరంగా ఎవరి కెరీర్ వారు కొనసాగిస్తున్నారు.

ఇప్పటికీ చాలా మందికి తెలియదు
ఇప్పటికీ చాలా మందికి రాధిక ఆప్టేకు పెళ్లయిందనే విషయం తెలియదు. ఎందుకంటే ఆమె పెళ్లి జరినట్లు ఎలాంటి ఫోటోలు ఇప్పటి వరకు బయటకు విడుదల కాలేదు. 2012లో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమే ఇందుకు కారణం. ఇద్దరూ కలిసి కనిపించిన సందర్బాలు కూడా చాలా తక్కువ.


Click it and Unblock the Notifications











