‘గర్భవతిగా ఉన్న సమయంలో టార్చర్.. ప్రొడ్యూసర్ నన్ను అస్సలు విడిచి పెట్లలేదు’
బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ మెప్పిస్తోంది రాధికా ఆప్టే. రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో మరింత గుర్తింపు దక్కించుకుంటోంది. ఈ క్రమంలో స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్, బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ల్లో పని చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా రాధికా ఆప్టే పేరు వార్తల్లో నిలించింది. అందుకు కారణం రాధికా ఆప్టే తన మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో జరిగిన ఒక బాధాకరమైన ఘటనను బయట పెట్టింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ఒక సినిమాకు పని చేసిన సమయంలో తనకు కలిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. తను గర్భంతో ఉన్నదని తెలిసి కూడా ఆ నిర్మాత తను ఇబ్బంది పెట్టారని వెల్లడించిందని బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.
ఆ వివరాల ప్రకారం.. రాధికా ఆప్టే ఏడాది కింద ఒక సినిమాకు పని చేస్తున్న సమయంలో, తనకు సెట్ కు వెళ్లిన తర్వాత ఆరోగ్యం కాస్తా సహకారంగా లేదంట. వెంటనే డాక్టర్ కు చూపించుకోవాలని అనిపించిందంట. కానీ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన నిర్మాత మాత్రం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని చెప్పారంట. డాక్టర్ దగ్గరకు చెకప్ కు వెళ్లడానికి అనుమతించలేదంట. దాంతో రాధికా ఆప్టే చాలా బాధ పడిందంట. ఇక తనకు విపరీతమైన ఆకలి వేయడంతో రైస్, పాస్తా తింటూనే ఉందంట. దాంతో తన బాడీలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది.

ఇక సెట్స్ లో ఎంతో ఇబ్బందిగా అనిపించిన, విపరీతమైన నొప్పి కూడా అనుభవిస్తూ పని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. డాక్టర్ ను కలిసేందుకు అనుమతించకపోగా బిగుతైన దుస్తులు కూడా వేసుకోవాలని ఒత్తిడి చేశారంట. అప్పటికే ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా సానుకూలంగా లేకపోవడాన్ని వాళ్లు లెక్క చేయలేదంట. ఆమెను ఏమాత్రం సరిగా చూసుకోలేదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆ నిర్మాత కనికరం లేకుండా ప్రవర్తించారని వ్యాఖ్యానించినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక తనకు జరిగిన ఈ ఘటనను ఫ్రీడమ్ టు ఫీడ్ అనే నేతా దుపియాస్ సెషన్ లో వెల్లడించింది.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి..
రాధికా ఆప్టే బ్రిటిష్ కు చెందిన వాయోలినిస్ట్, కంపోజర్ బెనెడిక్ట్ టేలర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన్ను రాధికా ఆప్టే తొలుత 2011 లండన్ లో కలిసింది. ఒక డ్యాన్స్ కోర్సులో వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2012 నుంచి సహజీవనం ప్రారంభించారు. 2013 మార్చిలో పెళ్లి చేసుకున్నారు. ఇక 2014 అక్టోబర్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. ప్రస్తుతం కుటుంబంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.
రాధికా ఆప్టే సినిమాలు..
2005 నుంచి రాధికా ఆప్టే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. రక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాల్లో బాలకృష్ణ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక చివరిగా బాలీవుడ్ లో మేరీ క్రిస్టమస్, హాలీవుడ్ లో సిస్టర్ మిడ్ నైట్, లాస్ట్ డేస్ అనే చిత్రాలతో అలరించింది. ఇక నెక్ట్స్ హిందీలో అక్క అనే సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











