Don't Miss!
- News
లోకేష్ యాత్ర కొత్త "టర్న్" - చంద్రబాబు వ్యూహాం: రంగంలోకి బాలయ్య - నందమూరి ఫ్యామిలీ..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Radhika Apte: బికినీలో బాలయ్య హీరోయిన్ స్టన్నింగ్.. బీచ్‌లో అలా అందాల ఆరబోత!
మోస్ట్ టాలెంటెడ్ బ్యూటిలలో ఒకరైన రాధికా ఆప్టే కేవలం నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా అప్పుడప్పుడు ఊహించని విధంగా షాక్ ఇస్తుంటుంది. ఎవరు ఏమనుకున్నా కూడా లెక్క చేయని రాధికా తనకు నచ్చినట్లుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇక బాషా భేదం లేకుండా సినిమాలలో కొనసాగుతున్న అమ్మడు రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా బికినీ లుక్ తో షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

మొదట్లోనే పవర్ఫుల్ బయోపిక్
2005 నుంచి వెండితెరపై కొనసాగుతున్న రాధిక ఆప్టే హిందీ బెంగాలీ మరాఠీ మలయాళం కన్నడ ఇలా అన్ని రకాల ఇండియన్ సినిమాల్లో నటించింది. మొదట తెలుగులో ఆమె రక్త చరిత్ర సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. మొదట్లోనే పరిటాల రవి పవర్ఫుల్ బయోపిక్ లో పరిటాల సునీత పాత్రలో నటించడం అందరికీ కనెక్ట్ అయ్యేలా చేసింది.

పాత్ర డిమాండ్ చేస్తే..
ఇక ఆ తర్వాత తెలుగు తమిళ్ మలయాళం అని తేడా లేకుండా విభిన్నమైన భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాధికా పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ డోస్ పెంచడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు అనే చెప్పాలి. కొన్ని పాత్రల్లో ఆమె అర్థనగ్నంగా కూడా నటించింది. అప్పట్లో ఆమెపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు తన సినిమా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తోంది.

బాలయ్యతో స్పెషల్ మూవీస్
ఇక రాధికా తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కూడా నందమూరి బాలకృష్ణ తో చేసిన రెండు సినిమాలు మాత్రం ఆమెకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కలయికలో వచ్చిన లెజెండ్ సినిమాలో రాధిక చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత లయన్ సినిమాతో కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది.

బికినీలో షాక్
అయితే రాధిక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా గ్లామర్ ఫోటోలతో షాక్ ఇస్తూ ఉంటుంది. గతంలో ఆమె బికినీలో చాలాసార్లు కనిపించింది. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక బికినీ ఫొటో మరింత స్టన్ అయ్యేలా చేసింది. చాలా హ్యాపీగా బీచ్ ఒడ్డున కూర్చున్న ఆమె థైస్ అందాలతో షాక్ ఇచ్చిందని అంటున్నారు. బికినీ అందాలతో రాధికా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది.
Recommended Video


ఆ సినిమాలతో బిజీగా
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ఇటీవల నటించిన ఫోరెన్సిక్ అనే సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నెల 24న ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే బాలీవుడ్ లో విక్రమ్ వేదా రీమేక్ లో కూడా నటించింది. ఆ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఆ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. అలాగే తెలుగులో కూడా మరికొన్ని ప్రాజెక్టులు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.