పెళ్లైన 12 ఏళ్లకు తల్లి అయిన హీరోయిన్.. డెలివరీ తర్వాత తొలిసారి అంటూ పోస్ట్

ఇటీవల సోషల్ మీడియా వినియోగం ఎక్కువైంది. దీంతో కొంతమంది సినీ సెలబ్రిటీలు తమ అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్డేట్స్ ను ఇస్తూ తమ అభిమానులకు చేరువవుతున్నారు. అలా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. ఆ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే (Radhika Apte). ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రకాష్ రాజ్ చేసిన 'ధోని' తొలుత నటించింది. తొలి సినిమాలోనే తన నటనతో మెస్మరైంజ్ చేసిన ఈ అమ్మడు బాలయ్య 'లెజెండ్' లో అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత లయన్, రక్త చరిత్ర వంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది ఈ అమ్మడు.

Actress Radhika Apte shared the joyous news of her first child s birth in Instagram

రాధికా ఆప్టే సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు మరియు టీవీ షోల్లో కూడా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. తన నటనతో ఎంతో మందిని మెప్పించింది. ఈ అమ్మడు బోల్డ్ పాత్రలు, సెమీ న్యూడ్ చిత్రాల్లో నటించి ట్రెండింగ్ మారింది. అంతేకాదు.. ఓ సినిమాలో నగ్నంగా నటించి సినీలవర్స్ ను ఎంటర్టైన్ చేసింది.తాజాగా ఈ అమ్మడు కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తోంది. రియల్ గా రాధిక డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు ఎప్పుడూ కూడా చర్చనీయమే.

ఇదెలా ఉంటే.. రాధిక ఆప్టే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను షేర్ చేయగా.. నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. రాధిక కెరీర్ 2012లో బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ ను పెళ్లి చేసుకుంది. దాదాపు పెళ్లైన 12 ఏళ్ళ తర్వాత ఈ అమ్మడు అమ్మ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తు గతంతో ఆమె ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. తాజాగా తన బిడ్డకు పాలిస్తూ ల్యాప్‌టాప్‌తో వర్క్ చేస్తున్న తన ఫొటోను పంచుకున్నారు ఈ అమ్మడు.

అంతే కాకుండా.. 'నా వన్ వీక్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ.. నేను డెలివరీ తర్వాత చేస్తున్న మొదటి పని' అంటూ రాసుకోచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే.. రాధిక తన బేబీ ఫేస్ మాత్రం చూపించలేదు.

More from Filmibeat

Read more about: radhika apte bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X