10 ఏళ్లు.. తెలుగు సినిమాలకు దూరంగా రాధికా ఆప్టే.. రీజన్?

స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే టాలీవుడ్ లో చేసింది కేవలం రెండు మూడు చిత్రాలే. కానీ ఆమె క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. నందమూరి నటసింహం బాలయ్య ఈ బ్యూటీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పటికే బాలీవుడ్ లో, ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకెళ్తూ ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ లోకి వచ్చి కూడా ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపును పొందింది. కానీ రాధికా ఆప్టే మాత్రం కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకు కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

10 ఏళ్లుగా దూరం..
టాలీవుడ్ కు రాధికా ఆప్టే 10 ఏళ్లుగా దూరంగా ఉంది. చివరిగా నందమూరి నటసింహాం నటించిన లయన్ చిత్రంతో అలరించింది. అంతకు ముందు లెజెండ్ చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకుంది. దానికంటే ముందే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర 1, 2లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన నటనతో కట్టి పడేసింది. ఇక టాలీవుడ్ కు రాధికా ఆప్టే ఎందుకు దూరంగా ఉందనే దానిపై ఓ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆమె మాట్లాడుతూ..

Actress Radhika Apte Shocking Comments on Telugu film Industry

'నేను బాగా స్ట్రగుల్ చేసిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగు. ఆ పరిశ్రమలో ఎక్కువగా పురుషాధిత్యం ఎక్కువుగా ఉంటుంది. మేల్ డామినేషన్ ను అధికంగా ఉంటుంది. నేనైతే భరించలేకపోయాను. కనీసం సినిమాలో భాగమైనప్పటికీని పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లోనైనా నటిగా ట్రీట్ చేసినట్టుగా అనిపించలేదు. అందుకే ఆ ఇండస్ట్రీ నుంచి తిరిగి వచ్చేశాను.' అని చెప్పుకొచ్చింది. అయితే రాధికా ఆప్టే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 10 ఏళ్లుగా తను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉందనే దానిపై ఇలా వివరణ లభించింది.

బ్యూటీఫుల్ ఫ్యామిలీతో..
ఓవైపు సినిమా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు తన భర్త, కూతురుతో రాధికా ఆప్టే సమయం గడుపుతోంది. ఆమె భర్త బ్రిటిష్ కు చెందిన వారు. ఆయన వయోలనిస్ట్, కంపోజర్. ఆయన పేరు బెనెడిక్ట్ టేలర్. ఇక వీరిద్దరూ 2011లో లండన్ లో నిర్వహించిన ఒక డ్యాన్స్ ఈవెంట్ లో కలిశారు. అలా వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. 2013 మార్చిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు అధికారికరంగా ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది 2014 అక్టోబర్ లో రాధికా ఆప్టే తన మొదటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది.

ఇంగ్లీష్ చిత్రాలపై ఫోకస్..
20 ఏళ్లుగా రాధికా ఆప్టే చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంది. తొలుత హిందీ, మరాఠి భాషల్లో నటించి మెప్పించింది. తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాల్లో మెరిసింది. ఇక కొన్నాళ్లు హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. రాధికా ఆప్టే 2024లో బాలీవుడ్ లో మేరీ క్రిస్టమస్ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక రీసెంట్ గా ఇంగ్లీష్ ఫిల్మ్ సిస్టర్ మిడ్ నైట్, లాస్ట్ డేస్ తో ఆకట్టుకుంది. నెక్ట్స్ బాలీవుడ్ సిరీస్ అక్కలో అలరించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X