ఒరేయ్ డైరెక్టర్ ఇటు రారా... చెంప చెల్లుమనిపించిన నటి, అసలు విషయం రాబట్టిన అలీ!

Recommended Video

Actress Raksha Sensational Comments On Director In A TV Show || Filmibeat Telugu

తెలుగు నటి రాణి అలియాస్ రక్ష అంటే ఎవరూ అంత త్వరగా గుర్తు పట్టక పోవచ్చు కానీ... అజిత్, దేవయాని మూవీ 'ప్రేమ లేఖలు' చిత్రంలో ట్రైన్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే 'చిన్నాదాన ఓసి చిన్నాదాన' అనే స్పెషల్ సాంగులో నటించిన బ్యూటీ అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 30కిపైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రక్ష... హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత రవిబాబు మూవీ 'నచ్చావులే'లో తల్లి పాత్ర ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ చిత్రానికి ఆమె నంది అవార్డు గెలుచుకున్నారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న రక్ష పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అలా సినిమాల్లోకి...

అలా సినిమాల్లోకి...

అనకాపల్లి దగ్గర ఓ చిన్న గ్రామానికి చెందిన కుటుంబంలో రక్ష జన్మించారు. ఆమె తండ్రి సినిమాలు తీయడానికి చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. ఎన్టీఆర్‌-జమునలతో ఓ సినిమాతో పాటు మరొక సినిమా నిర్మించి నష్టపోయారట. ఆ తర్వాత తాను సినిమాల్లోకి చిన్న చిన్న పాత్రలు వేస్తూ తెరంగ్రేటం చేసినట్లు రక్ష తెలిపారు.

‘ప్రేమ లేఖలు’ సాంగ్ తర్వాత మంచి గుర్తింపు

‘ప్రేమ లేఖలు’ సాంగ్ తర్వాత మంచి గుర్తింపు

అజిత్, దేవయాని హీరో హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమ లేఖలు' సినిమాలో ‘చిన్నాదాన ఓసి చిన్నాదాన' సాంగ్ చేసిన తర్వాత రక్షకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సాంగ్ అంత పెద్ద హిట్టవుతుందని భావించలేదు, ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయిన అని రక్ష గుర్తు చేసుకున్నారు.

పిచ్చి వేషాలు వేస్తే అస్సలు సహించను

పిచ్చి వేషాలు వేస్తే అస్సలు సహించను

ఎవరైనా నా పిచ్చి వేశాలు వేసినా... అసభ్యంగా ప్రవర్తించినా అస్సలు సహించలేను. బి.గోపాల్‌గారి దర్శకత్వంలో ‘రవన్న' సినిమా చేసే సమయంలో చెన్నై నుంచి హైదరాబాద్ విమానంలో వస్తుంటే పక్కనే కూర్చున ఓ పెద్దాయన నన్ను టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కోపం ఆగలేదు. ఈ వయసులో ఇదేం పనిరా అంటూ అక్కడే చెంప పగలగొట్టాను' అని రక్ష గుర్తు చేసుకున్నారు. శుభలేఖలు సినిమా సమయంలో మరొకడు ఇలాగే నన్ను చూసి అసభ్యంగా కన్ను కొడితే చితక్కొనట్లు రక్ష తెలిపారు.

ఒరేయ్ ఇలా రారా... అని పిలిచి దర్శకుడి చెంప చెల్లు మనిపించా

ఒరేయ్ ఇలా రారా... అని పిలిచి దర్శకుడి చెంప చెల్లు మనిపించా

ఓ తమిళ సినిమా దర్శకుడి తీరు నచ్చక అతడిని కొట్టి మూవీ వదులుకున్నాను. నాకు కథ చెప్పినపుడే... పెళ్లయింది, గ్లామర్ పాత్రలు చేయను, స్లీవ్ లెస్ డ్రెస్సులు కూడా వేయను, అలా అయితేనే చేస్తాను అని క్లియర్‌గా చెప్పాను. అయితే షూటింగ్ మొదలైన తర్వాత వారి ప్రవర్తన మరోలా ఉంది. నా భర్త గురించి కూడా అదో రకంగా మాట్లాడారు. నాకు మండి పోయింది. ‘ఒరేయ్‌ ఇలా రారా' అని దర్శకుడిని పిలిచి మరీ చెంప చెల్లుమనిపించా. పోలీస్ కంప్లయింట్ కూడా ఇద్దామనుకున్నాను. నా సినిమా ఆగిపోతుందని ఆ హీరో బత్రిమిలాడటంతో వదిలేశాను... అని రక్ష గుర్తు చేసుకున్నారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

మాది వివాహం.. నా సినిమా కెరీర్ విషయంలో ఆయన చాలా సపోర్టుగా ఉంటారు. నచ్చితే చేయ్ లేకుంటే లేదు అని చెబుతారు. ఆయన దుబాయ్‌లో హోటల్స్‌ వ్యాపారంలో ఉన్నారు. మాకు డిగ్రీ చదివే కూతురు ఉంది అని రక్ష చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X