twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు బాయ్‌ఫ్రెండ్ లేకపోవడానికి అతడే కారణం.. అలా నన్ను వెంటాడేవాడు.. రకుల్

    |

    అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకొంటూ సత్తా చాటుతున్నారు. వయసు పెరుగుతున్నా చక్కటి ఫిట్‌నెస్‌తో అందానికి మెరుగులు దిద్దుకొంటున్నారు. అందరు హీరోయిన్లకు భిన్నంగా గాసిప్స్‌కు దూరంగా ఉంటూ కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నారు. తాజాగా తన పెళ్లి గురించి తల్లి చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ.. తన లవ్ లైఫ్, పర్సనల్ విషయాలను చిలిపిగా వెల్లడించారు. రకుల్ చెప్పిన విషయాలు ఏమిటంటే.

    అఫైర్లపై వార్తలతో

    అఫైర్లపై వార్తలతో

    కెరీర్ ఆరంభంలో రకుల్ ప్రీత్ సింగ్ అఫైర్ల గురించి గాసిప్స్ భారీగానే వచ్చాయి. అయితే తనపై వచ్చిన రూమర్లు, గాసిప్స్‌కు తనదైన శైలిలో చెక్ పెట్టగలిగారు. గతంలో రానా దగ్గుబాటితో అఫైర్ నడుస్తుందంటూ వార్తలు రావడం టాలీవుడ్‌లో సంచలనం రేపాయి. అయితే రానా నాకు ఫ్రెండ్ అనే విషయాన్ని చెప్పి అలాంటి గాసిప్స్‌కు తెరదించారు.

     రానా నాకు మంచి ఫ్రెండ్

    రానా నాకు మంచి ఫ్రెండ్

    రానాతో రిలేషన్ గురించి రకుల్ ప్రీత్ వెల్లడిస్తూ.. నేను రానా ఇరుగు పొరుగు వాళ్లం. పక్క పక్క ఇళ్లలోనే ఉంటాం. మా ఇద్దరి మధ్య స్వచ్ఛమైన ఫ్రెండ్ షిప్ ఉంది. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఆయనతో పరిచయం, స్నేహం ఉంది. మా మధ్య అంతకంటే మరో రిలేషన్ లేదు అని రకుల్ చెప్పారు. తనకు ఇండస్ట్రీలో మంచి స్నేహితులంటే రానా, లక్ష్మీ మంచు అని చెప్పారు.

    బాయ్‌ఫ్రెండ్ లేకపోవడానికి నా సోదరుడే కారణం

    బాయ్‌ఫ్రెండ్ లేకపోవడానికి నా సోదరుడే కారణం

    ఇక మా ఇంట్లో నాకు పెళ్లి పోరు ఎక్కువై పోతున్నదని రకుల్ వెల్లడించారు. వరుడిని చూసుకోమంటే చూసుకోవడం లేదన తల్లి చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేకపోవడానికి కారణం నా సోదరుడు. చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో కలవనిచ్చేవారు కాదు. అందుకే నేను సింగిల్ స్టేటస్‌తో ఉండాల్సి వస్తున్నది. నేను ఏం చేస్తున్నాననే విషయాన్ని తెలుసుకోవడానికి నా సోదరుడు నన్ను ఎప్పుడూ వెంటాడేవాడు అని ఓ ప్రశ్నకుల రకుల్ చిలిపిగా జవాబు ఇచ్చారు.

    నాపై నా సోదరుడు ఫిర్యాదులు

    నాపై నా సోదరుడు ఫిర్యాదులు


    చిన్నప్పటి నుంచి నేను ఎవరైనా అబ్బాయితో కనిపిస్తే నాపై మా అమ్మకు నా సోదరుడు ఫిర్యాదు చేస్తుండేవారు. అలా నేను అబ్బాయిలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. ఒకసారి స్కూల్‌లో ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయితో కలిసి భోజనం చేస్తూ ఉంటే నా బ్రదర్ ఇంటికి వెళ్లి నాపై కంప్లయింట్ చేశారు. నేను ఆ అబ్బాయికి తినిపిస్తున్నాడని చెప్పడంతో ఇంట్లో చాలా గొడవ జరిగిందనే విషయాన్ని రకుల్ ప్రీత్ పేర్కొన్నారు.

    రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్..

    రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్..

    రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌ను బ్రహ్మండంగా ప్లాన్ చేసుకొంటున్నారు. బాలీవుడ్‌లో షిమ్లా మిర్చి, జాన్ అబ్రహంతో ఎటాక్, అజయ్ దేవగన్‌తో థ్యాంక్స్ గాడ్, తమిళంలో శివకార్తికేయన్‌తో ఆయాలన్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో చివరిగా మన్మథుడు 2లో నటించగా ఆ చిత్రం దారుణంగా ఫ్లాప్ కావడం ఆమెను నిరాశకు గురిచేసింది.

    English summary
    Rakul Preet Singh shared some information about her Single status and her relationships. She said that My brother always keeps eye on me in my school days and college days. So that I could find a lover.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X