రకుల్ ప్రీత్‌కు యువ రాజకీయ నేత విల్లా గిఫ్టు.. రూమర్లపై బ్యూటీ క్లారిటీ ఏంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటన, టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. పదేళ్లకు పైగా దక్షిణాది ప్రేక్షకులనే అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేసుకున్న తర్వాత దక్షిణాది చిత్రాలకు పూర్తిగా దూరమైంది. అయితే తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించిన విషయాలను అభిమానులతో ఇలా పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనపై వచ్చిన ఘోరమైన పుకార్లపై స్పందించింది. క్లారిటీ ఇచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ వివరాలు..
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఢిల్లీకి చెందిన పంజాబీ కుటుంబంలో పుట్టింది. కుల్విందర్ సింగ్ - రాజేంద్ర కౌర్ దంపతులకు 1990 అక్టోబర్ 10న జన్మించింది. రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ల నాన్న ఆర్మీ ఆఫీసర్. దాంతో రకుల్ తన స్కూలింగ్ మొత్తం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత మెథమెటిక్స్ లో డిగ్రీ పట్టాను పొందింది. ఆమెకు తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. ఆయన కూడా నటుడు కావడం విశేషం. ఇక రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

రకుల్ ప్రీత్ సింగ్ పై వచ్చిన రూమర్..
రకుల్ ప్రీత్ సింగ్ 2011 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చాలా దగ్గరగా ఉంటోంది. ప్రస్తుతం తన కెరీయర్ లో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తనకు టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులతో పరిచయాలు, సన్నిహితం కూడా ఉంది. ఆమెను కూడా టాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు ప్రొఫెషనల్ గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రకుల్ ప్రీత్ కు కూడా హైదరాబాద్ మహానగరంలో ఒక ఇట్లు, జిమ్ సెంటర్ కూడా ఉంది. అయితే ఈ క్రమంలోనే కొందరు రకుల్ ప్రీత్ పై ఓ రూమర్ సృష్టించారు. తనకు తెలంగాణలోని ప్రముఖ పొలిటికల్ లీడర్ కు సంబంధం ఉందని, అతనే రకుల్ కు ఆ ఇంటిని బహుమతిగా అందించాడని ప్రచారం చేశారు. దీనిపై కొన్నాళ్లుగా విపరీతమైన చర్చ సాగిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది దాని లో వాస్తవం లేదనే చెప్పారు. ఇక తాజాగా ఆ రూమర్ పై రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించి క్లారిటీ ఇచ్చింది.
రకుల్ ప్రీత్ క్లారిటీ ఏంటంటే..
తాజా ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ తనపై వచ్చిన రూమర్ గురించి చెబుతూ బాధ పడింది. హైదరాబాద్ లో తనకు ఒక ఇల్లు ఉందని, అయితే అది తనకు ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారనే రూమర్లు తనను ఎంతగానో బాధపెట్టాయని, తనపై ఓ వింత పుకార్లు పుట్టించడం చాలా బాధ కలిగిందని చెప్పింది. అయితే ఆ విషయం తన తండ్రికి కూడా తెలిసిందని, ఆయన కంగారు పడ్డారన్నారు. అయితే ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లను దగ్గరుండి చేయించిందే తన తండ్రి అని, ఇక అలాంటి రూమర్లు వినడంతో ఆయన కోపంతో రగిలిపోయాడని చెప్పింది. వారికి బదులివ్వాలని తనకు సూచించినట్టు లేటెస్ట్ ఇంటర్వ్యూలో వివరిస్తూ క్లారిటీ ఇచ్చింది.
టాలీవుడ్ బైబై..
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించింది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇక చివరిగా 2021లో వచ్చిన 'కొండపొలం' చిత్రంలో మెరిసి తెలుగు సినిమాలకు దూరమైంది. పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే ప్రాధానత్యనిస్తోంది.


Click it and Unblock the Notifications











