బయటపడ్డ రకుల్ సోకులు: చిన్న పిల్లలు వేసుకునేంత డ్రెస్‌లో ఘాటుగా!

సినిమా రంగంలో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తగ్గట్లుగా అదృష్టం కూడా కలిసి రావాలి. అలా టాలీవుడ్‌లో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏమాయ చేసిందో కానీ.. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిన ఈ భామ.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది.

దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో సత్తా చాటుతోంది. తాజాగా సోషల్ మీడియాలోనూ రకుల్ ప్రీత్ సింగ్ ఫోజులు కొడుతూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

Actress Rakul Preet Singh Latest Stunning Pictures Viral

అక్కడ ఎంట్రీ.. తెలుగులో: సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఈ క్రమంలోనే 'గిల్లి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'కెరటం' అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీతో మొదటి విజయం అందుకుంది.

స్టార్ హీరోయిన్‌గానే హవా: రకుల్ ప్రీత్ సింగ్‌ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తర్వాత టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. ఫలితంగా ఆమెకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఢిల్లీ బ్యూటీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసేసింది. అలాగే ఎంతో మంది స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. దీంతో రకుల్ టాలీవుడ్‌లో స్టార్‌‌డమ్‌ను సొంతం చేసుకుని చాలా కాలం హవాను చూపించింది.

Actress Rakul Preet Singh Latest Stunning Pictures Viral

బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా: తెలుగులో వరుసగా భారీ ప్రాజెక్టుల్లో భాగమై సత్తా చాటిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత తమిళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. అలా అక్కడ కూడా ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే ఈమె 'యారియాన్' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

వరుస చిత్రాలతో రచ్చ: రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే 'మిషన్ సిండ్రెల్లా', 'డాక్టర్ జీ', 'థ్యాంక్ గాడ్', 'చత్రివాలి', '31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే సినిమాలు చేసింది. ఇప్పుడేమో 'అయలాన్', 'ఇండియన్ 2', 'మేరి పత్నీ' రీమేక్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

సోషల్ మీడియాలోనూ: దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ఎన్నో భాషల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. దీని ద్వారానే తన సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటోంది.

Actress Rakul Preet Singh Latest Stunning Pictures Viral

హాట్ షోతో క్రేజ్ కూడా: చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇందులో విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదిలింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందాల ప్రవాహాన్ని పెంచేసి కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

రకుల్ బోల్డ్ పిక్స్ వైరల్: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న డ్రెస్‌ను ధరించి విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఫలితంగా వీటిలో ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో రకుల్ వదిలిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X