సోషల్ మీడియాలో మరో రికార్డ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. ఒక ఫొటోతో లక్షల్లో లైకులు అందుకుంటున్నారు. ఇక ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యల్లో పెంచుకుంటున్నారు. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్ లో వారి ఫాలోవర్స్ సంఖ్య భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు.
ఇక ఇప్పుడు వారి కంటే హై రేంజ్ లో రకుల్ ప్రీత్ సింగ్ మరో కొత్త రికార్డ్ దిశగా పయనిస్తోంది. ఇటీవల ఆమె ఫాలోవర్స్ సంఖ్య 15మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకుంది. ఈ సందర్భంగా రకుల్ ఒక స్పెషల్ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

'యంగ్ ఏజ్ లోనే ఏమి తెలియనప్పుడే నా సినిమా కెరీర్ ని స్టార్ట్ చేశాను. సోషల్ మీడియా మీద కూడా నాకు నిజంగా ఒక అవహగన లేదు. అయినప్పటికీ నేను కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్న సమయంలో మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు. 15 మిలియన్స్ ఫ్యామిలీ నాతో ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా ఒక నటిగా మిమ్మల్ని ఇంకా ఎక్కువ స్థాయిలో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ఇక ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా దాన్యవాదాలు' అని రకుక్ కూల్ గా వివరణ ఇచ్చింది.
ఇక ప్రస్తుతం రకుల్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమాపై రకుల్ ఆశలు చాలానే పెట్టుకుంది. అయితే ఆ సినిమాకు అనుకోని విధంగా అంతరాయలు వచ్చి పడుతున్నాయి. రకుల్ తో పాటు కాజల్ అగర్వాల్ కూడా అందులో మరో కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











