మగబిడ్డకు జన్మనిచ్చిన రంభ.. కఠిన నిర్ణయం వెనక్కి తీసుకుని, వెల్లివిరిసిన సంతోషాలు!
Recommended Video

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రంభ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. రంభ, ఇంద్రన్ దంపతులు 2010 లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. తాజాగా రంభ, ఇంద్రన్ కుటుంబం మరింత పెద్దదిగా మారింది. రంభ, ఇంద్రన్ దంపతులకు మూడవ సంతానం కలిగినట్లు తెలుస్తోంది.

పండండి మగ బిడ్డ
సీనియర్ హీరోయిన్ రంభ పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. చెన్నైలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో రంభకు ప్రసవం జరిగింది. దీనితో రంభ, ఆమె భర్త ఇంద్రన్ దంపతులు సంతోషంలో ఉన్నారు. ఇది వీరికి మూడవ సంతానం. ఇప్పటికే రంభ, ఇంద్రన్ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

శ్రీమంతంలో డాన్స్
ఆ మధ్యన రంభ శ్రీమంతం ఫోటోలు సోషల్ ఎండియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. శ్రీమంతం వేడుకలో అందరితో కలసి రంభ డాన్స్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెప్టెంబర్ 23 న రంభ మెగా బిడ్డకు జమ్మనిచ్చిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇంద్రన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.

సమస్యలు అధికమించి
2017 లో రంభ, ఇంద్రన్ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యాయి. వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. విడిపోదామని నిర్ణయించుకుని విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు కూడా. విడాకులు సరైన నిర్ణయం కాదని ఈ దంపతులిద్దరూ కలసి చర్చించుకుని విభేదాలు పరిష్కరించుకుంటారు. విడాకుల కేసుని రద్దు చేసుకుని కలసి జీవిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం గత ఏడాది జరిగింది. ఏడాది తిరిగేసరికి రంభ మగ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. ప్రస్తుతం వీరి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతోంది.

సినిమాలకు దూరం
2010లో వివాహం చేసుకున్న తరువాత రంభ సినిమాలు బాగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఇంద్రన్ కెనడా వంటి దేశాల్లో వ్యాపారవేత్త. రంభ చాలా కాలం పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.


Click it and Unblock the Notifications











