దొంగతనం చేశా .. చిరంజీవికి తెలిస్తే కేసు తప్పదు , సంచలన విషయం బయపెట్టిన హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించి.. నేడు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు చిరు. గాడ్ ఫాదర్ లేకుండా హేమ హేమీలున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్ధాలుగా టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్నారు. ఆయను చూడాలని, కనీసం ఒక్క ఫోటో దిగినా చాలని అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. అలాంటిది ఏకంగా చిరంజీవి ఇంట్లోనే దొంగతనం చేసింది ఓ స్టార్ హీరోయిన్. ఆ వివరాల్లోకి వెళితే.
90వ దశకంలో దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన ఆమె అసలు పేరు విజయలక్ష్మీ. పరిశ్రమలోకి ఇచ్చాక తన స్టేజ్ నేమ్‌ను రంభగా మార్చుకున్నారు. తెలుగు సహా దాదాపు 8 భారతీయ భాషల్లో నటించిన అరుదైన ఘనతతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రంభ. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు రంభ తొలి చిత్రం.

ఫస్ట్ మూవీతోనే లుక్స్, అందాల ఆరబోతతో ఆమె కుర్రకారుకు గిలిగింతలు పెట్టారు. దివ్యభారతిలా ఉందని కొందరు రంభను కీర్తించారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ సహా జగపతిబాబు, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, విజయ్, అజిత్ వంటి స్టార్స్‌తో నటించారు. కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన రంభకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. దేశముదురు, యమదొంగ సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెమ్మదిగా ఫేడ్ ఔట్ అవుతున్న దశలో ఇక ఫ్యామిలీ లైఫ్‌లో సెటిలైపోవాలని నిర్ణయించుకుంది రంభ. దీనిలో భాగంగా 2010లో మలేషియాకు చెందిన ఇంద్రకుమార్ అనే పారిశ్రామికవేత్తను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రంభ.. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. మనీలా మయిలా, ద్వయం నెంబర్ 1, ఏబీసీబీ వంటి షోలకు జడ్జిగా చేశారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లల తల్లి అయిన రంభ తన వయసు, ఇమేజ్‌కు తగ్గ క్యారెక్టర్ లభిస్తే ఖచ్చితంగా కెమెరా ముందుకు వస్తానని పలుమార్లు చెప్పారు. కొన్ని సినిమాలకు ఆమె కథ కూడా విన్నట్లు టాక్. త్వరలోనే రంభ రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇదిలాఉండగా.. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంభ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన విషయం ఒకటి బయటపెట్టారు. ఒక అద్దం తీసుకొచ్చి.. ఇది ఎవరిదో చెబితే నా మీద పోలీసులు కేసు పెడతారని చెప్పింది. ఈ అద్దం చిరంజీవి గారిదని.. తన మేకప్‌మెన్, చిరంజీవి మేకప్ మెన్‌కి బంధువు అవుతారని రంభ తెలిపారు. ఓ రోజున నా మేకప్ మెన్ మరో చోటికి వెళ్లాల్సి రావడంతో మెగాస్టార్ గారి మేకప్ మెన్ వచ్చి తనకు మేకప్ వేసినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఆయన చిరంజీవి అద్దం తీసుకొచ్చి నాకు ఇవ్వడంతో ఆ రోజు మొత్తం దానినే వాడుకున్నానని, అలాగే పొరపాటుగా ఆ అద్దాన్ని ఇంటికి తెచ్చేశానని.. నాటి నుంచి చిరంజీవి గారి గుర్తుగా దానిని నాతో పాటే ఉంచుకున్నానని రంభ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











