Rambha: హీరోయిన్ రంభ ఆస్తులు ఎంత? సంపాదన ఎన్నివేల కోట్లో తెలుసా?
సీనియర్ నటి రంభ... 90 చివరిలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తన 15 ఏట వరకు చదువుకున్న రంభ.. తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదట మలయాళంలో 'సర్గం' చిత్రంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రంభ. రాజేంద్ర ప్రసాద్ సరసన నటించి మెప్పించింది. 1992లో ఈ చిత్రం విడుదలై విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది.
ఆ తర్వాత చిరంజీవి సరసన 1997లో వచ్చిన 'హిట్లర్' చిత్రంతో పాపులర్ అయ్యింది. మెగాస్టార్ కు ధీటుగా పెర్ఫామెన్స్ ఇచ్చి ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. అలా మొదలై మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బోజ్ పూరీ, బెంగాళీ వంటి భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ ల్లోనూ తనదైన మార్క్ క్రియేట్ చేసింది. తన అందంతో యువతను ఆ రోజుల్లో ఊర్రూతలూగించింది. స్పీడ్, గ్రేస్ తో స్టార్ హీరోలకు ధీటుగా స్టెప్పులేసి అదరగొట్టింది.

అల్లు అర్జున్ 'దేశముదురు'లో అట్టాంటోడే ఇట్టాండోదే.. ఎన్టీఆర్ 'యమదొంగ'లో నాచోరే నాచోరే మూవీలో అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అంతకు ముందు కూడా పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపింది. అయితే 2010 తర్వాత రంభ సినిమాలకు దూరమైంది. కానీ మలయాళం, తెలుగు భాషల్లోని టెలివిజన్ సిరీస్ ల్లో మెరిసింది. జడ్జీగా వ్యహరించి తన అభిమానులను, టీవీ ప్రేక్షకులను అలరించింది. అలా బుల్లితెరపై ఎనిమిదేళ్ల పాటు సందడి చేసింది. ఇక ఫైనల్ గా రంభ మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నదని ఇండస్ట్రీలో హాట్ వార్త చక్కర్లు కొడుతోంది.
త్వరలో వెండితెరకు రాబోతున్న వార్తలతో పాటు రంభ ఆస్తుల విలువ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నిర్మాత కలైపులి ఎస్ థాను రంభ ఆస్తుల వివరాలను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. రంభ 2010లో కెనడాకు చెందిన శ్రీలంకన్ తమిళ వ్యాపార వేత్త ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఆయన మల్టిపుల్ బిజినెస్ లు చేస్తుంటారు. ప్రస్తుతం వీరి వ్యాపారాలన్నీ కెనడాలో, చెన్నైలో ఉన్నాయంట. ఇంటీరియల్, వుడ్ కు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. వాటి విలువ రూ.2,000 కోట్ల వరకు ఉంటుందంట.

నార్మల్ సెలబ్రెటీలాగానే కనిపించే రంభ ఆస్తులు వివరాలు బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక రంభ తమిళంలోని పలు టీవీ సిరీస్ లకు జడ్జీగా వ్యవహరించింది. అలాగే తెలుగులోనూ 'ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో', 'ఏబీసీడీ - ఎనీబడీ కెన్ డ్యాన్స్' షోకు కూడా జడ్జీగా వ్యహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. నెక్ట్స్ తమిళంలో ప్రారంభం కాబోతున్న 'జోడి: ఆర్ యు రెడీ' డ్యాన్స్ షో కొత్త సీజన్‌లో జడ్జీగా అలరించబోతోంది. అలాగే మరోవైపు వెండితెరపైనా మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











