Rambha 47 ఏళ్ల వయసులోనూ ఊపేస్తున్న రంభ - ఈ అందం అస్సలు చెక్కు చెదర్లే!

హీరోయిన్ రంభ అనగానే నిజంగా ఆ ఇంద్రుడి దగ్గర ఉండే రంభ ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. తనదైన నటన, అందచందాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా సందడి చేసింది రంభ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తన హవాను చూపించింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలు చేసింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన ఈ భామ.. తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

ఇంద్రుని లోకంలో ఉండే రంభ.. ఎలా ఉంటుందో తెలియదు కానీ మన భూలోకంలో ఉండే రంభ మాత్రం ఇప్పటికీ అలాగే చెక్కుచెదరని అందంతో ఉందనే చెప్పాలి. రంభ హీరోయిన్ గా యుక్తవయసులోనే ఎంట్రీ ఇచ్చింది. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఇక ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రంభ ఆ తర్వాత ఎన్నో మంచి ఆఫర్స్ ను అందుకుంది. స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Actress Rambha Stunning Photos Viral In Social Media

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, కృష్ణ వంటి స్టార్ హీరోలతో హీరోయిన్ గా నటించిన ఈ భామ ఎన్నో సక్సెస్ సినిమాలు చేసింది. ఇప్పడంటే పాన్ ఇండియా హీరోయిన్, పాన్ ఇండియా హీరో అంటూ ఉంది కానీ.. ఆ కాలంలోనే ఈ భామ పాన్ ఇండియా హీరోయిన్. ఒక్క తెలుగులోనే కాదు.. రంభ కన్నడం, మలయాళం, బెంగాళీ, బోజ్‌పురి, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. రంభకు మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.

Actress Rambha Stunning Photos Viral In Social Media

ఇక సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా రంభ ప్రత్యేక గీతాల్లో కూడా అలరించింది. యమదొంగ చిత్రంలో నాచోరే సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలయ్యతో నరుడా ఓ నరుడా అనే పాటలో, హాలో బ్రదర్ లో నాగార్జునతో ఓ ప్రత్యేక గీతం, దేశముదురులో అల్లు అర్జున్ తో కలిసి ఓ ప్రత్యేక గీతాల్లో అలరించి దుమ్ములేపింది. ఇవే కాకుండా గెస్ట్ రోల్స్ చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి.

ఇక కెరియర్ పీక్స్ లో ఉందనగా.. రంభ ఓ బిజినెస్‌మ్యాన్ ఇంద్రకరణ్ పద్మనాథన్‌ ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ తమిళం, మలయాళంలో మాత్రం పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక 2011 తర్వాత పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతోనే గడుపుతుంది. ఇంద్రకరణ్ పద్మనాథన్‌ తో పెళ్లి తర్వాత రంభ కెనడా దేశంలో సెటిలైంది. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు.

Actress Rambha Stunning Photos Viral In Social Media

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఇటీవల రంభ తన కూతురి ఫోటోలు షేర్ చేయగా.. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ జూనియర్ రంభ అంటూ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రంభ 47ఏళ్ల వయసులోనూ తన అందంతో ఊపేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆ వీడియోపై ఓ లుక్ వేసి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X