Raashi Khanna: బెల్లి డ్యాన్సర్ తో కలిసి రాశి ఘాటైన స్టెప్పులు.. అలాంటి డ్రెస్సులో షాకింగ్ లుక్!
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ తో ఎంతగా ఆకట్టుకుంటున్నా కూడా ఎందుకో గాని అనుకున్నంత స్థాయిలో అయితే అవకాశాలు రావడం లేదు. ఇక చాలా కాలంగా రాశి ఖన్నా పరిస్థితి కూడా అలానే కొనసాగుతోంది. అమ్మడు ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతున్న కూడా అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు.
ఇక వీలైనంత వరకు మిడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అప్పుడప్పుడు అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఆమె బెల్లి డ్యాన్సర్ తో కలిసి స్టెప్పులు వేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొన్న అందాల భామ రాశీఖన్నా. ఈ బ్యూటీ చివరిగా తెలుగులో పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ కి జోడీగా కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ సినిమా అవకాశాలు పెంచుకునే పనిలో ఉంది. హిందీలో ఆమె నటించిన యోధ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

తమిళంలో కూడా రెగ్యులర్ గా: రీసెంట్ గా తమిళంలో అరణ్మణి 4 మూవీకి కమిట్ అయ్యింది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అలాగే మేథావి అనే మరో తమిళ్ సినిమా చేసింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది. అయితే తరుచుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పార్టీస్ కి అటెండ్ అవుతూ అక్కడ దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. అలాగే రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్ లని షేర్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది.

దుబాయ్ లో రాశిఖన్నా: బాలీవుడ్ వైపు ఫోకస్ చేసిన తర్వాత గ్లామర్ షో కూడా రాశీఖన్నా పెంచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఇంటరెస్టింగ్ వీడియో ని అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో తాను దుబాయ్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసింట్లు ఫ్లాష్ కట్స్ తో అన్నింటిని చూపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో రాశి ఖన్నా వేసుకున్న డ్రెస్ కూడా చాలా గ్లామరస్ గా ఉంది.

బెల్లి డ్యాన్సర్ తో స్టెప్పులు వేస్తూ: ఫ్లైట్ లో దుబాయ్ వెళ్తున్న దృశ్యాలతో పాటు బూర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళిన విజువల్ అలాగే రోలర్ కోస్టార్ ఎక్కి ఎంజాయ్ చేసిన ఫుటేజ్ వీడియో లో ఉంది. అలాగే ఓ బెల్లీ డాన్సర్ దగ్గర టిప్స్ తీసుకుంటూ ఆమె తరహాలోనే డాన్స్ మూమెంట్స్ చేసే ప్రయత్నం చేసింది. ఇలా దుబాయ్ లో స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ అన్నింటిని ఒక్క వీడియోలో చూపించేసింది.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏకంగా 2.74 లక్షల మంది వీడియోని లైక్ చేయడం విశేషం. దుబాయ్ లో మంచి ఫుడ్, అడ్వంచర్, కొద్దిగా షాపింగ్, కొద్దిగా డాన్స్ తో మొత్తం అంతా ఫుల్ హ్యాపీగా గడిచింది అని చెబుతూ ట్రావెల్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది.


Click it and Unblock the Notifications











