ఎవరు చేస్తున్నారో దయచేసి ఆపండి.. తప్పుగా క్రియేట్ చేస్తున్నారు.. రాశి ఖన్నా సీరియస్!

సినిమా ప్రపంచంలో సెలబ్రిటీలు ప్రతి విషయంలో కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. ఏమాత్రం మాట తప్పిన కూడా జనాల్లో నెగిటివ్ కామెంట్స్ అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో చాలా తీవ్రంగా మారిపోయింది కాబట్టి సెలబ్రిటీలు రూమర్స్ వచ్చిన వెంటనే వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాశి ఖన్నా పై ఇటీవల ఒక వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ విషయం పై సోషల్ మీడియా ద్వారా రాశి కన్నా చాలా సీరియస్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే సక్సెస్

మొదట్లోనే సక్సెస్

తెలుగు చిత్ర పరిశ్రమలో బబ్లీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రాశికన్నా మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక అక్కినేనివారి మనం సినిమాలో ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించిన రాశి కన్నా ఆ తర్వాత చాలా సినిమాల్లో గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకుంది. సోలో హీరోయిన్ గా మొదట్లోనే సక్సెస్ అవడంతో బ్యూటీ పేరు ఇండస్ట్రీలో అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

సౌత్ సినిమాలపై కాంట్రవర్సీ కామెంట్స్?

సౌత్ సినిమాలపై కాంట్రవర్సీ కామెంట్స్?

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రాశికన్నా ఇటీవల ఎవరూ ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ చేసింది అని సోషల్ మీడియాలలో టాక్ వైరల్ అయ్యింది. ఆమె సౌత్ ఇండస్ట్రీ సినిమాలపై ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్ చేసింది అని చాలా తక్కువ చేసి మాట్లడింది అని కూడా సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కూడా కామెంట్స్ వచ్చాయి.

ఆ వెబ్ సీరీస్ ప్రమోషన్లో..

ఆ వెబ్ సీరీస్ ప్రమోషన్లో..

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా మారుతున్న రాశికన్నా ఇటీవల అజయ్ దేవ్ గన్ తో కలిసి నటించిన రుద్ర అనే వెబ్ సీరిస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రాశి కన్నా సౌత్ సినిమాలపై స్పందించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నిన్నటి వరకు సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న రాశి కన్నా ఇప్పుడు సౌత్ లో రొటీన్ సినిమాలే ఎక్కువ అన్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రాశిఖన్నా రియాక్షన్

రాశిఖన్నా రియాక్షన్

ఇక ఆ వార్తలు వైరల్ అవుతుండడంతో వెంటనే సోషల్ మీడియా ద్వారా రాశి ఖన్నా తన వైపు నుంచి ఒక వివరణ ఇచ్చింది. దక్షిణాది చిత్రాల గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు కొన్ని కల్పిత వార్తలు, తప్పుగా అర్థం చేసుకున్న కంటెంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరు ఈ తరహా వార్తలను క్రియేట్ చేసినా దయచేసి ఆపమని అభ్యర్థిస్తున్నాను. నేను చేసే ప్రతి భాష, చిత్రం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి.. అని రాశి ఖన్నా వివరణ ఇచ్చింది.

అదేపనిగా వైరల్ అయ్యేలా..

అదేపనిగా వైరల్ అయ్యేలా..

నిజానికి రాశి కన్నా తాను ఎక్కువగా సౌత్ లో రొటీన్ సినిమాలు చేశాను అంటూ ఇక నుంచి కాస్త భిన్నమైన సినిమాలో చేయడానికి ప్రయత్నం చేస్తాను అని క్లారిటీ ఇచ్చింది. ఈ కామెంట్స్ ను సోషల్ మీడియాలో అదేపనిగా వైరల్ అయ్యేలా చేయడంతో మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వెంటనే రాశి కన్నా ఆ విషయం పై క్లారిటీ ఇస్తూ తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X