నాడు బాధితురాలు.. నేడు ప్రచారకురాలు.. పాన్ ఇండియా హీరోయిన్ కు అరుదైన గౌరవం
Rashmika Mandanna: దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు సంఖ్య కూడా పెరుగుతోంది. మనకు తెలియకుండానే అందులో చిక్కుకుంటున్నారు. అందులో పడి సర్వం కోల్పోతున్నారు. ఈ సమస్య దేశానికి పెను ప్రమాదంగా మారింది. ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రజలను హెచ్చరించినా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. చిన్న పొరపాటు భారీ గ్రహ పాటుగా మారుతోంది. ఇలా ఒక్కప్పుడూ బాధితురాలుగా మారిన స్టార్ హీరోయిన్ సైబర్ నేరాలపై అవగాహగన కల్పించబోతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో? ఆమె ఏ ప్రొగ్రామ్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది ఓ లూక్కేయండి.
సైబర్ నేరాలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇందులో డీఫ్ ఫేక్ వీడియోలు మాత్రం జీవితాలను ఆగం చేస్తున్నారు. సెలబ్రిటీస్, సామాన్యులనే తేడా లేకుండా.. ఈ సైబర్ దాడి బారిన పడుతున్నారు. కొంతమంది కేటుగాళ్లు.. డీప్ ఫేక్ వీడియో (Deep fake video)లను క్రియేట్ చేసి సోషల్ మీడియా (Social media)లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు.

వీటిపై కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే.. మరికొందరు మాత్రం పరువు పోతుందని సైలెంట్ గా ఉంటున్నారు. మరి కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియో భాదితుల్లో పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక (Rashmika)ను భారత ప్రభుత్వం ఓ కీలక బాధ్యతను అప్పగించింది. సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి రష్మిక మందన్నను అంబాసిడర్ గా నియమించింది భారత ప్రభుత్వం.
ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు సంబంధించిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. అలాగే.. రష్మిక కూడా ఓ వీడియో షేర్ చేసింది. రష్మిక మందన్న షేర్ చేసిన స్పెషల్ వీడియోలో గతంలో తాను ఎదుర్కొన్న డీప్ ఫేక్ అనే చేదు అనుభవాన్ని పంచుకుంది. డీప్ ఫేక్ అనేది. అది సైబర్ క్రైమ్.. తాను దాటి బారిన పడిన నాడే.. దాని వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నానని, ఈ నేరాలపై అందరికి అవగాహన కల్పించాలని అనుకున్నానని వెల్లడించింది.

తాజాగా తనని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుందనీ, సైబర్ నేరస్థులు కాపాడానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటాననీ, అలాగే.. మనం అలర్ట్ గా ఉంటూ.. మనల్నీ మనం కాపాడుకుందామన్నారు. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తాననీ, దేశాన్ని సైబర్ క్రైమ్ నేరాల నుంచి కాపాడుతానని రష్మిక మందన్న హామీ ఇచ్చారు.
గతంలో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో బారిన పడిన విషయం తెలిసిందే.. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోకు రష్మిక ఫేస్ ను ఏఐ సహాయంతో ఎడిట్ చేశారు. అభ్యంతరకరమైన వీడియోను క్రియేట్ చేశాడు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ విషయంపై ముందుగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఈ విషయంపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో రష్మిక సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రష్మికకు పలువురు సినీ ప్రముఖులు సపోర్టుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం .


Click it and Unblock the Notifications











