పూజా హెగ్డేకు ధీటుగా రష్మిక మందన్న.. పుష్ప దెబ్బకు లిస్టులో మరో బిగ్ మూవీ!

పుష్ప సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన అస్సలు తగ్గడం లేదు. తెలుగులోనే కాకుండా హిందీలో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఆమె బిగ్ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల కాలంలో కొంతమంది సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో బుట్ట బొమ్మ పూజా హెగ్డే డామినేషన్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి. దాదాపు స్టార్ హీరోలందరి తో సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే ఒక విధంగా నెంబర్ వన్ స్తానంలో ఉన్నట్లు క్రేజ్ అందుకుంటోంది.

ఇక ఆమెకు పోటీగా రష్మిక మందన్న కూడా ఏ మాత్రం తగ్గకుండా తన దైన శైలిలో స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. మొత్తానికి ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ విజయ్ తో కూడా సినిమా చేసేందుకు సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ 66 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను నేడు ప్రకటించారు. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించబోతున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు.

Actress Rashmika Mandanna big budget movie with thalapathy vijay

ఇక ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన్న క్రేజ్ ఏ స్థాయికి పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ అమితాబ్ బచ్చన్ ఇలా పెద్ద హీరోలతో వర్క్ చేస్తోంది. ఇక తెలుగు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్స్ కు పోటీగా రష్మిక మందన్న విజయ్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ బ్యూటీ పారితోషికం రెండు కోట్లకు పైగా పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం అంతకుమించి డిమాండ్ చేస్తూ ఉండవచ్చు అని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు పూజా హెగ్డే అయితే బీస్ట్ సినిమా కోసం దాదాపు మూడు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా కోసం రష్మిక మందన్న రెండున్నర కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది దర్శకుడు వంశీ పైడిపల్లి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

విజయ్ 66వ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం విజయ్ దాదాపు వంద కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు కూడా టాక్ గట్టిగానే వచ్చింది. తెలుగు తమిళంలో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాన్ ఇండియా ట్రెండ్ కి తగ్గట్టుగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వంశీ పైడిపల్లి విజయ్ తో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి. విజయ్ సినిమా అనంతరం వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X