మళ్లీ రెచ్చిపోయిన రష్మిక మందన్నా: ఆ ఫోజులు చూస్తే తట్టుకోలేరు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా హడావిడి చేసేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో రష్మిక మందన్నా ఒకరు. కొంత కాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. దక్షిణాది నుంచి ఉత్తరాదికి తన స్థాయిని పెంచుకుంది. దీంతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. నేషనల్ రేంజ్

అలా పరిచయం.. నేషనల్ రేంజ్

చదువు పూర్తైన వెంటనే రష్మిక మందన్నా ‘కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత అక్కడే పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘ఛలో' అనే మూవీతో వచ్చింది. తర్వాతత తన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

టాలీవుడ్‌లో హవా చూపించింది

టాలీవుడ్‌లో హవా చూపించింది

ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత రష్మిక మందన్నా తెలుగులో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘ఛలో'తో పాటు ‘గీత గోవిందం', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ', ‘పుష్ప' వంటి భారీ విజయాలను అందుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక‌కు స్టార్‌డమ్‌తో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంది.

 ఇక్కడా అక్కడా... విజయాలతో

ఇక్కడా అక్కడా... విజయాలతో

రష్మిక మందన్నా కొద్ది రోజుల క్రితమే ‘సీతా రామం' అనే సినిమాలో కీలక పాత్రను చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించాడు. ఇది సూపర్ హిట్ అవడంతో ఆమె మరోసారి సక్సెస్ బాట పట్టింది. అలాగే, అమితాబ్‌తో కలిసి రష్మిక నటించిన ‘గుడ్‌బై' మూవీ ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్‌‌ను దక్కించుకుంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉంది.

ఆ భాషల్లోనూ వరు సినిమాలతో

ఆ భాషల్లోనూ వరు సినిమాలతో

రష్మిక మందన్నా ఈ ఏడాది చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీ డిజాస్టర్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప 2' మూవీ చేయనుంది. అలాగే, ‘మిష‌న్ మ‌జ్ను' మూవీతో బాలీవుడ్ ఎంటర్ అవుతోంది. అలాగే, రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘యానిమల్' మూవీలోనూ భాగమైంది. వీటితో పాటు ఎన్నో తెలుగు సినిమాల్లో భాగమైంది.

 సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

సౌత్ నుంచి నార్త్ వరకూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ

అందాలను ఆరబోస్తోన్న భామ

సుదీర్ఘ కాలంగా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా హాట్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది.

హాట్ పిక్స్ షేర్ చేసిన రష్మిక

హాట్ పిక్స్ షేర్ చేసిన రష్మిక

సౌతిండియన్ స్టార్ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేసేలా డ్రెస్‌ను వేసుకుంది. దీంతో ఇందులో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో రష్మిక మందన్నా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X