Rashmika Mandanna: మళ్ళీ రెమ్యునరేషన్ పెంచిన నేషనల్ క్రష్.. ఒక్క సినిమాకు ఎంతంటే?

ఇప్పుడున్న హీరోయిన్స్ లో చాలావరకు అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. మొన్నటి వరకు అగ్ర హీరోయిన్స్ గా ఉన్న వారందరి రేంజ్ కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తోంది. ఇక సక్సెస్ రేంజ్ ని బట్టి ఇక్కడ రెమ్యునరేషన్ లెక్క మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరికంటే ఎక్కువగా తీసుకుంటున్న వారిలో అయితే పూజా హెగ్డే తో పాటు రష్మిక మందన్న కూడా నిన్న మొన్నటి వరకు పోటీ పడింది.

అయితే ఇప్పుడు మాత్రం బుట్ట బొమ్మ కంటే నేషనల్ క్రష్ ఎక్కువ స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా ఆమె బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడం కూడా ఆమెకు బాగా ప్లస్ అయింది. దీంతో నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 1 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ద్వారా ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

Actress Rashmika Mandanna hiked her remuneration for feature projects

ప్రస్తుతం చేతుల్లో కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల సీతారామం సినిమాలో చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. కమర్షియల్ గా ఆమె మార్కెట్ కు కూడా ఆ సినిమా ప్లస్ పాయింట్ అయ్యింది. రాబోయే విజయ్ సినిమా వారసుడు సినిమాపై కూడా ఆమె మంచి నమ్మకంతోనే ఉంది. ఇక ప్రస్తుతం అయితే రష్మిక మందన ద్విభాష సినిమాలతో పాటు ఫ్యాన్ ఇండియా సినిమాలకు కాను మొత్తంగా 5 కోట్ల వరకు పారితోషికం అడుగుతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా ఆమె దాదాపు 5కోట్ల వరకు తీసుకోబోతున్నట్లు సమాచారం. పుష్ప 1 సినిమా వరకు ఆమె రెమ్యునరేషన్ కేవలం కోటిన్నర వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా అంతకంటే ఎక్కువ స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉండడం విశేషం. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆమె మూడు సినిమాలు చేస్తోంది. అందులో ఏ ఒక్కటి సక్సెస్ అయినా కూడా నేషనల్ క్రష్ మరో రేంజ్ కు వెళ్లిపోవడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X