Rashmika Mandanna: బ్లేజర్ వేసినట్టే వేసి గ్యాప్ ఇచ్చిన రష్మిక.. ఆ అందాలు మొత్తం హైలెట్..
నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన కేవలం తెలుగు, కన్నడ భాషలకే పరిమితం కాకుండా తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆమె అనేక ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు... బోల్డ్ ఫోటోషూట్లకు కూడా సయ్యంటోంది. రీసెంట్ గా అమ్మడు ప్రముఖ మ్యాగజైన్ కోసం ఉహించని విధంగా స్టిల్స్ ఇచ్చింది. ఆ వివరాలలోకి వెళితే..

ఎలాంటి కామెంట్స్ చేసినా
రష్మిక ఎలాంటి కామెంట్స్ చేసినా ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. రెండు యాంగిల్స్ లేవని తాను ఇంట్లో ఎలా ఉంటానో సెట్లో కూడా అలాగే ఉంటానంటూ రష్మిక మందాన్న ఈ బజార్ ఇండియా మ్యాగజైన్ కి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు నటించడం అంటే కేవలం ఆన్ స్క్రీన్ లో మాత్రమే వచ్చని బయట ఒరిజినల్ గా ఎలా ఉంటానో అదే తన క్యారెక్టర్ అని చెప్పుకొచ్చింది. వ్యక్తుల ముందు నటించడం తనకు రాదని రష్మిక కామెంట్ చేసింది.

సినిమాలతో బిజీగా..
ఇక రష్మీక.. నితిన్, వెంకీ కుడుముల సినిమాలో నటిస్తుంది. నిన్ననే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అలాగే పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి తన నటన మరింత విభిన్నంగా ఉంటుంది అని కూడా ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అలాగే చర్చల దశలో మరి కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయట ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ప్రాజెక్టులలో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొదట్లో అలా.. ఇప్పుడిలా..
ఒకప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో గ్లామర్ షో కి కాస్త దూరం మెయింటైన్ చేసిన ఈ భామ... ఆ తర్వాత దాదాపుగా చేస్తున్న అన్ని ఫోటోషూట్లు బోల్డ్ గానే ఉంటున్నాయి. అదేవిధంగా కాక రేపే విధంగానే సాగుతున్నాయి. తాజాగా బజార్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ కోసం రష్మిక మందన ఫోజులిచ్చింది.

క్లీవేట్ షో చేస్తూనే
ఈ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో బ్లాక్ జీన్స్ ధరించిన ఈ భామ... ఒక డిజైనర్ వేర్ కోటు ధరించింది. ఈ డిజైనర్ వేర్ కోటులో క్లీవేట్ షో చేస్తూనే నడుము అందాలు చూపించి చూపించకుండా ఫోజులిచ్చింది. మరో ఫోటోలో అయితే ఏకంగా బ్లేజర్ ధరించి లోపల ఎలాంటి లోదుస్తులు లేకుండా ఆమె కనిపిస్తూ షాక్ ఇచ్చింది.

లేటెస్ట్ స్టిల్స్ వైరల్
ఈ ఫోటోలను సదరు బజార్ ఇండియా అనే మాగజైన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా... అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక అభిమానులు అందరూ ఈ ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. అలాగే రష్మిక అందాలంటే ఈ మాత్రం ఉండాలి అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ఒకవైపు సినిమాలతో సక్సెస్ అందుకుంటూనే మరొకవైపు ఈ విధంగా ఫోటోషూట్స్ తో కూడా తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా రష్మిక మంచి ఆదాయాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











