ఏకంగా నాలుగో పెళ్ళికి రెడీ అయిన స్టార్ హీరోయిన్

కాంట్రవర్సీయల్ హీరోయిన్, సీనియర్ అగ్ర నటుడు విజయ కుమార్ డాటర్ వనిత విజయ్ కుమార్ గురించి తెలిసిందే. ఈమె తెలుగులో కాకుండా పలు భాషల్లో నటించి సినీ ప్రేక్షకుల్ని మెప్పించింది. కానీ సినిమాలకంటే వివాదాలతోనే చాలా పాపులర్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో ఏ రేంజ్‌లో గొడవ పెట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరి వివాదం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. కేవలం ఇదొక్క ఇష్యూనే కాదు.. చాలా వివాదస్పద కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తుండేది వనిత విజయ్ కుమార్.

ఇక వనిత విజయ్ కుమార్ మొదటిసారి హీరో ఆకాష్ ను వివాహం చేసున్న విషయం తెలిసిందే. వీరు జోవిక, విజయ్ హరి అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కొన్నేళ్ల తర్వాత ఏమైందో తెలియదు కానీ విడిపోయారు. ఇక ఆకాష్ తో విడిపోయి.. తర్వాత రెండో పెళ్లిగా ఆనంద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి కూడా జయనిత్ అనే కుమారుడు జన్మించాడు. కారణం తెలియనప్పటికీ వనిత విజయ్ కుమార్ అండ్ ఆనంద్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇక మూడోసారి ముచ్చటగా పీటర్ పాల్ అనే పర్సన్‌ను వివాహం చేసుకుంది. కలిసి హ్యాపీగా ఉంటుంది.

Actress reality TV star Vanitha Vijayakumar wedding with choreographer actor Robert Raj will take place on October 5

అంతా బాగానే ఉందనుకున్న సమయంలో వీరిద్దరు కూడా పెళ్లి బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో వనిత విజయ్ కుమార్ దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంది. తప్పు ఎవరిదో తెలియదు కానీ.. వనిత ను అయితే నెటిజన్లు ఓ రేంజ్‌లో తిట్టిపోశారు.వరుసగా మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. వనితకు వివాహాలు అచ్చి రాలేదు అని జనాలు కామెంట్లు చేశారు. తర్వాత ఈమె పెళ్లిళ్ల గోల పక్కన పెట్టి సినిమాల బాట పట్టింది. సినిమాల్లో నటించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. చివరగా సీనియర్ అగ్ర నటుడు నరేష్ అండ్ పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పళ్లి అనే చిత్రంలో అవకాశం కొట్టేసింది.

ఇవన్నీ పక్కన పెడితే.. అనిత విజయ్ కుమార్ తాజాగా అభిమానులందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈమె నాలుగో పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మరీ ఆ అనిత పెళ్లి చేసుకోబోయేది ఎవరని ఆలోచిస్తున్నారా...? ఆ పర్సన్ ఎవరో కాదు.. స్టార్ కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అపిషీయల్ గా ప్రకటించింది.

Actress reality TV star Vanitha Vijayakumar wedding with choreographer actor Robert Raj will take place on October 5

ఈ స్టోరీలో కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ అండ్ వనిత విజయ్ కుమార్ బీచ్ లో గడుపుతోన్న ఫొటోను తన అభమానులతో పంచుకుని.. అక్టోబరు 5 వ తేదీ.. సేవ్ ది డేట్ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంతమంది నెగిటివ్ గా స్పందించగా.. మరికొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయి.. వనితకు ముందుగానే పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: vanitha vijaykumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X