నాకు చాలా మందితో ఎఫైర్లు.. బయటపెట్టిన రెజినా

అందం , అభినయం ఉన్నా ఎందుకో కొందరు ముద్దుగుమ్మలు చిత్ర పరిశ్రమలో రాణించలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటుంటారు. ఇదే కోవలోకి వస్తుంది రెజీనా కాసాండ్రా. 20 ఏళ్ల క్రితమే కెరీర్ మొదలుపెట్టినా ఇంకా సరైన సక్సెస్ కోసం ఇంకా పోరాడుతూనే ఉంది రెజీనా. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు రెజీనా.. ఆ వివరాల్లోకి వెళితే..

శివ మనసులో శృతి, రోటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట , సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది చెన్నై చిన్నది రెజీనా. ఆ వెంటనే పిల్లా నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్ వంటి మూవీస్ చేసినా హీరోయిన్‌గా స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. ఏక్ లడ్కీతో హైసా లగా సినిమా ద్వారా హిందీలోనూ తన అదృష్టం పరీక్షించున్నారు. ఇక రానాతో నటించిన 1945 మూవీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.

Actress Regina Cassandra bold comments on her personal life here s the details

సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లలోనూ నటించారు రెజీనా. ఫింగర్ టిప్, ఆన్య ట్యూటోరియల్, శూర్‌వీర్ వంటి వెబ్‌సీరిస్‌లలో భాగమయ్యారు. మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్యలో రెజీనా ఐటెం సాంగ్‌లో మెరిశారు. సానా కష్టం అంటూ తన నడుము ఒంపులతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. ఈ దెబ్బతో తన కెరీర్ గాడినపడుతుందని అనుకున్న రెజీనాను చివరికి చిరంజీవి కూడా కాపాడలేకపోయారు. ఆ తర్వాత శాకినీ డాకినీ అనే సినిమా చేసినా అది కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రెజీనా ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. పర్సనల్ విషయాలని ఒకరిద్దరు తప్పించి చాలా మంది సెలబ్రెటీలు బయటపెట్టరు. దీని వల్ల లేనిపోని రూమర్స్ తమపై చక్కర్లు కొడతాయని వారి భయం. ముఖ్యంగా హీరోయిన్లు తమ ప్రేమ, రిలేషన్, ఎఫైర్స్ విషయంలో చాలా సీక్రెట్‌గా ఉంటారు. అయితే రెజీనా మాత్రం తాను ఇందుకు పూర్తి విరుద్ధమని చెబుతారు.

రెజీనా నటించిన ఉత్సవం మూవీ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత వివరాలు పంచుకుంది. తాను చాలా మందితో రిలేషన్‌లో ఉన్నానని.. తానొక సీరియల్ డేటర్‌నని , ప్రస్తుతం అలాంటి వాటికి బ్రేక్ చెప్పి సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది. పర్సనల్ లైఫ్‌ను దాచి పెట్టాలని తానెప్పుడూ అనుకోలేదని, సందీప్ కిషన్‌ తానూ టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటామని తెలిపింది. అలాగే సాయిథరమ్ తేజ్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లుగా ఎన్నో గాసిప్స్ వచ్చాయని రెజీనా పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X