దానికి యస్ చెబితేనే .. సౌత్ అమ్మాయిల్ని దారుణంగా , బాలీవుడ్‌పై ఆచార్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఇండియాలోని అన్ని పరిశ్రమల్లో పనిచేసే స్టార్స్, టెక్నీషియన్స్ ఇలాంటి అందరి గమ్యస్థానం బాలీవుడ్డే. డైరెక్ట్‌గా ముంబైలో అడుగుపెట్టడం సాధ్యం కాదు కాబట్టి.. వేరే ఇండస్ట్రీలలో ముందుగా ఛాన్స్‌లు దక్కించుకుని ఇక్కడొచ్చే పాపులారిటీతో బాలీవుడ్‌కు రాచబాటలు ఏర్పాటు చేసుకుంటారు. శ్రీదేవి, జయప్రద, హేమామాలిని, ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, కృతిసనన్ తదితరులు సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో చోటు దక్కించుకున్న వారే. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు రిలీజ్ అవుతున్నా.. బాలీవుడ్ ఇమేజే వేరు.
అయితే చాలా మంది ఇతర భాషల అమ్మాయిలకు బాలీవుడ్‌లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ముంబైలో సెటిలవ్వాలని అనుకున్న ఎందరో తారలు మధ్యలోనే మూట ముల్లె సర్దుకుని సొంతూళ్లకి వచ్చేస్తున్నారు. అక్కడి వాతావరణం సెట్ కాకపోవడం ఒకటైతే, భాష, రీజనల్ ఫీలింగ్ ఇంకో ఎన్నో కారణాలు ఉన్నాయి. తాను కూడా ఇలాంటి బాధితురాలినే అంటున్నారు సీనియర్ హీరోయిన్ రెజీనా కాసాండ్ర.

అందం , అభినయం ఉన్నా ఎందుకో కొందరు ముద్దుగుమ్మలు చిత్ర పరిశ్రమలో రాణించలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇదే కోవలోకి వస్తుంది చెన్నై చిన్నది రెజీనా కాసాండ్రా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే కెరీర్ మొదలుపెట్టినా ఇంకా సరైన సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంది రెజీనా. శివ మనసులో శృతి, రోటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట , సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా.
ఆ వెంటనే పిల్లా నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్ వంటి సినిమాలు చేసినా హీరోయిన్‌గా స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. ఏక్ లడ్కీతో హైసా లగా సినిమా ద్వారా హిందీలోనూ తన అదృష్టం పరీక్షించున్నారు. ఇక రానాతో నటించిన 1945 మూవీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లలోనూ నటించారు రెజీనా. ఫింగర్ టిప్, ఆన్య ట్యూటోరియల్, శూర్‌వీర్ వంటి వెబ్‌సీరిస్‌లలో భాగమయ్యారు.
చివరికి ఐటెం సాంగ్స్‌కి కూడా పచ్చజెండా ఊపింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆచార్యలో ఏకంగా మెగాస్టార్ పక్కన రెజీనా ఐటెం సాంగ్‌లో మెరిశారు. సానా కష్టం అంటూ తన నడుము ఒంపులతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. కానీ రెజీనాను చివరికి చిరంజీవి కూడా కాపాడలేకపోయారు. ఆ తర్వాత శాకినీ డాకినీ అనే సినిమా చేసినా అది కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్సవం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ప్రస్తుతం రెజీనా తమిళ్‌లో విదాముయార్చి, ఫ్లాష్‌బ్యాక్ .. హిందీలో జాట్, సెక్షన్ 108 సినిమాలలో నటిస్తున్నారు. జాట్‌కు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. బాలీవుడ్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సౌత్ నుంచి వెళ్లే అమ్మాయిలకు భాష రాకపోతే వారికి అవకాశాలు రావన్నారు. అలాగే ముంబైలోనే అందుబాటులో ఉండాలని, మీటింగ్స్‌కి రావాలని కండీషన్స్ పెడతారని ఆమె చెప్పారు. కానీ సౌత్‌లో అలా ఉండదని రెజీనా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











