Regina Cassandra: మెగా హీరోతో బ్రేకప్.. మరో హీరోతో పెళ్లి... రెజినా కసాండ్రా ఓపెన్
Regina Cassandra:సినీ నటులు, నటీమణులు సినిమా ద్వారా డబ్బు, పేరు సంపాదించుకుంటారు. వారు ఏం చేసినా.. ఎవరితో కలిసి తిరిగినా కష్టమే. వెంటనే పలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఆ నటి మరో హీరోతో రిలేషన్ లో ఉందనీ, ఫలనా హీరోయిన్ ఫలనా హీరోను పెళ్లి చేసుకోబోతుందట. ఆ స్టార్ హీరోయిన్ మరో హీరోతో సిక్రెట్ రిలేషన్ షిప్ పెట్టుకుందంటూ.. ఎన్నో రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. అలాంటి రూమర్స్ ఎదుర్కొంటున్న హీరోయినే టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా .. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'ఉత్సవం' అనే మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని తనపై వస్తున్న రూమార్స్ కు చెక్ పెడుతూనే.. తన ఎఫైర్స్ గురించి రివీల్ చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎలాంటి కామెంట్స్ చేసిందో మీరు కూడా ఓ లూక్కేయండి.
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుధీర్ బాబుతో 'శివ మనసులో శ్రుతి' (SMS)సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది రెజీనా. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, రా..రా కృష్ణయ్య, నగరం వంటి సినిమాల్లో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో కలిసి నటించింది. అలాగే.. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో మెగా కంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది. ఈ ఇద్దరూ కలిసి నటించిన 'నక్షత్రం' సినిమాలోనూ రెజీనా నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఉత్సవం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ అమ్మడు తన ఎఫైర్స్ గురించి రివీల్ చేసింది.

వాస్తవానికి ఈ అమ్మ డు ఎక్కడు ఉంటే.. అక్కడ రూమర్స్ క్రియేట్ అయ్యేలా ఉన్నాయి. తొలుత ఈ ముద్దగుమ్మ రెజీనా వరుసగా యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించింది. ఈ క్రమంలో ఆన్ లైన్ కెమిస్రీ.. ఆఫ్ లైన్ లో తిరగటం చూసిన పలువురు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని చర్చించుకున్నారు. ఆ రేంజ్ లో వారిద్దరూ కెమిస్ట్రీని పండించారు. ఈ రూమర్స్ అన్నింటికి అప్పట్లోనే సందీప్ కిషన్ చెక్ పెట్టారు. తామిద్దరం కేవలం ప్రెంఢ్స్ మాత్రమే చెప్పేశాడు. రూమార్స్ కాస్త ఆగినా వారిద్దరూ ఎక్కడ కనిపించ పుకార్లు షికార్లు చేసేవి.
ఆ తర్వాత ఈ అమ్మడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో వరుసగా లవ్, రోమాంటిక్ మూవీస్ చేసింది. ఈ మూవీతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఆ సమయంలోనూ కూడా
వీరిద్దరి మీద అనేక రూమర్లు వచ్చాయి. రెజీనా, సాయిధరమ్ తేజ్ లు పెళ్లి చేసుకోబోతోందంటూ కూడా వార్తలు వచ్చాయి. వాటిని వీరిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా రెజీనా నటిస్తున్న ఉత్సవం సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో ముచ్చటించింది.
'ఉత్సవం' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రేజీనా. ఈ బ్యూటీ తన కెరీర్ తో పాటు తన రిలేషన్షిప్స్ గురించి
షాకింగ్ కామెంట్స్ చేసింది. "నేను చాలా మందితో రిలేషన్ లో ఉన్నాను. చాలా ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. నేను ఓ సీరియల్ డేటర్ ని. కానీ, కొంత కాలంగా రిలేషన్ షిప్ కు పుల్ స్టాప్ పెట్టాను. ప్రసెంట్ ఎవరితోనూ డేటింగ్ లో లేను. ఐ ఆమ్ సింగిల్" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సాయిధరమ్ తేజ్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, ఆయన చాలా కూల్ అని, తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది. తామిద్దరం ఏనాడూ గొడవపడలేదని చెప్పింది. అలాగే సందీప్ కిషన్ తో తన రిలేషన్ వేరనీ, తాము టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ ఇద్దరం గొడవ పడుతూనే ఉంటామని చెప్పింది. అయినా ఎప్పుడూ కలిసే ఉంటామని, తనకు సందీప్ కిషన్ తో పెళ్లి అయిందని, సాయిధరమ్ తేజ్ తో బ్రేకప్ అయిందని చాలాసార్లు వార్తలు వచ్చాయని రెజీనా చెప్పింది.
'నారా రోహిత్ తో బాలకృష్ణుడు, శంకర, జో అచ్యుతానంద సినిమాల్లో నటించానని, అయినా తామిద్దరి రిలేషన్ గురించి ఎటువంటి రూమర్లు రాకపోవడం విశేషమని చెప్పింది. సోషల్ మీడియా వార్తల ప్రకారమైతే.. తనకు ఇప్పటికే అర డజన్ సార్లు పెళ్లి ఉండాలని, తనకు పెళ్లి చేసుకునే వాడు ఇలా ఉండాలని, అలా ఉండాలని తాను ఏనాడూ ఏమీ అనుకోలేదని చెప్పింది.' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











