నేను ప్రేమలో పడితే.. సాయిధరమ్ తేజ్‌తో అఫైర్ గురించి రెజీనా!

Recommended Video

Regina Cassandra Reacted On Affair With Sai Dharam Tej || Filmibeat Telugu

దక్షిణాది అందాల తార రెజీనా కసండ్రా దాదాపు అన్నిభాషల్లో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందీలో ఇటీవల విడుదలైన ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా, తమిళంలో సిలుకువర్ పట్టి చిత్రాల్లో కనిపించింది. తెలుగులో బిజీగా ఉన్న సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత బ్రేకప్ కూడా జరిగిందనే వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే గతంలో సాయిధరమ్ తేజ్‌తో అఫైర్ విషయం ఇంకా వెంటాడుతుండగా దానిపై మరోసారి ఆమె క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..

సాయిధరమ్ తేజ్‌తో రెజీనా అఫైర్

సాయిధరమ్ తేజ్‌తో రెజీనా అఫైర్

గతంలో సాయిధరమ్ తేజ్, రెజీనా కలిసి వరుసగా పలు చిత్రాల్లో నటించారు. ఈ జంటకు ప్రేక్షకులు కూడా సానుకూలంగా స్పందించడంతో వారి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. దాంతో వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి పీటల వరకు వారి ప్రేమ వెళ్లింది. అయితే సాయి, రెజీనా అఫైర్ బ్రేక్ కావడంతో వారిద్దరూ విడిపోయారు అనే వార్తలు అప్పట్లో జోరందుకొన్నాయి.

నాతో లింక్ పెట్టొదని

నాతో లింక్ పెట్టొదని

రెజీనాతో బ్రేకప్ తర్వాత సాయి ధరమ్ తేజ్‌ ఆమెకు చాలా దూరంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వారిద్దరూ కలుసుకొన్న దాఖలాలు లేవు. అయినా వారి మధ్య అప్పుడప్పుడు ఏవో రూమర్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇటీవల రెజీనా స్పందిస్తూ ఇటీవల కాలంలో నాకు, నా హీరోలతో లింకు పెడుతూ వార్తలు వస్తున్నాయని, అది సరికాదు అన్నారు.

 రూమర్లలో నిజం లేదని

రూమర్లలో నిజం లేదని

నా వ్యక్తిగత జీవితం గురించి అవాస్తవ కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం చేయదలుచుకొన్నాను. నాపై రాసే రూమర్లలో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నాకు ఎవరితో అఫైర్ లేదు. నాకు కెరీర్ మీద ప్రేమ తప్ప.. మరోదానిపై ధ్యాస లేదు అని రెజీనా స్పష్టం చేశారు.

నేను ప్రేమలో పడితే చెప్తాను

నేను ప్రేమలో పడితే చెప్తాను

ఒకవేళ మీరు రాస్తున్నట్టు నేను ఎవరితోనైనా ప్రేమలో పడితే.. ముందుగా నేను ఆ విషయాన్ని వెల్లడిస్తాను. ప్రతీ క్షణం నన్ను ప్రొత్సహిస్తున్న మీకు.. మీరు కురిపిస్తున్న ఆదరాభిమానాలకు నేను రుణపడి ఉంటాను అని రెజీనా చెప్పారు. ఇక ఆఫర్ల రూమర్లపై సాయిధరమ్, రెజీనాలు గతంలోనూ స్పందించారు. మా మధ్య స్నేహం తప్ప మరోటి లేదు అని స్పష్టం చేశారు.

12వ తేదీన చిత్రలహరి రిలీజ్

12వ తేదీన చిత్రలహరి రిలీజ్

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 12న రిలీజ్ కానున్నది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయిక. ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. ఇక రెజీనా కెరీర్ విషయానికి వస్తే.. వెంకట్ ప్రభు రూపొందించే పార్టీ, అరవింత్ స్వామితో కల్లాపార్ట్ అనే చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X