పెళ్లి వద్దు.. దానికైతే ఎప్పుడైనా ఓకే.. హీరోయిన్ రెజీనా బోల్డ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా కస్సాండ్రా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. చైన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి ఆడియెన్స్ లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది. టాలీవుడ్ ద్వితీయ శ్రేణి హీరోలతో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలోనూ రెజీనా కస్సాండ్రా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఇంటర్వ్యూల్లోనూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నది. కాగా తాజాగా తనకు పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని పంచుకుంది. తన విషయంలోనూ పెళ్లి సెట్ అవ్వదని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
రెజీనా కస్సాండ్రా గురించి..
నటి రెజీనా కస్సాండ్రా తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ లో 1990 డిసెంబర్ 13న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 34 ఏళ్లు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి బీజీఎస్సీ సైకాలజీ విభాగంలో పట్టా పొందింది. తమిళ్ ఫ్యామిలీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు భాషలోనూ అనర్గళంగా మాట్లాడుతుంది. ఇక తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2005 నుంచి హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఫీమేల్ లీడ్ చిత్రాలు, విమెన్ సెంట్రిక్ కథల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది.

పెళ్లిపై రెజీనా కస్సాండ్రా..
పలు ఇంటర్వ్యూల్లో రెజీనా కస్సాండ్రా తన వ్యక్తిగత విషయాలను పరిధి మేరకు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఏ విషయమైనా ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే రెజీనా కస్సాండ్రా తాజాగా పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'ఎలాంటి మగవారైనా నన్ను శాశ్వతంగా భరించలేరు. నేను లైఫ్ లాంగ్ కమిట్ మెంట్స్ ఇవ్వాలని ఇప్పుడు అనుకోవడం లేదు. కానీ డేటింగ్ వరకు అయితే ఓకే.' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ ఎంట్రీ ఇలా..
రెజీనా కస్సాండ్రా తొలుత తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్ లోకి సుధీర్ బాబు సరసన శివ మనస్సులో శృతి(SMS) చిత్రంలో నటించి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రోటీన్ లవ్ స్టోరీ, పిల్లా నువ్వు లేని జీవితం, పవర్, అ, ఎవరు, షాకినీ డాకినీ వంటి చిత్రాలతో అలరించింది. ఇక చివరిగా విదాముయార్చి, జాట్, కేసరి ఛాప్టర్ 2 వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రూల్స్ లో మెరిసింది. ఆ 3 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
రెజీనా రాబోయే చిత్రాలు..
తెలుగులో చివరిగా రెజీనా కస్సాండ్రా ఉత్సవం అనే చిత్రంలో నటించింది. అంతకు ముందుకు షాకినీ డాకీనీ సినిమాతో అలరించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో స్పెషల్ డ్యాన్స్ తో దుమ్ములేపింది. ఇక ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు మూక్తి అమ్మన్ 2, ఫ్లాష్ బ్యాక్, హిందీలో సెక్షన్ 108 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











