రేణు దేశాయ్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్.. 3500 రూపాయలు కూడా లేవా? ఇదిగో అసలైన క్లారిటీ
రేణు దేశాయ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న ఆమె.. విడాకుల తర్వాత కూడా అభిమానుల నుంచి అదే రీతిలో ప్రేమను పొందుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె యమా యాక్టివ్‌గా ఉండడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే రేణు దేశాయ్ తనకు కొంత డబ్బు అవసరం అంటూ చేసిన మెసేజ్ వైరల్ అయింది. తాజాగా దీనిపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!
అందులో అలాంటి పనులు
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ సంబంధించిన విశేషాలను తరచూ ప్రస్తావిస్తుంటారు. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక, ఇందులో రేణు దేశాయ్ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

3500 కావాలి.. హ్యాక్ చేశారు
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్.. తాజాగా తనకు 3500 రూపాయలు కావాలి అంటూ చేసిన ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అయిపోయింది. అంతేకాదు, ఓ క్యూఆర్ కోడ్ కూడా అందులో కనిపించింది. దీంతో కొంత మంది ఆమెకు నిజంగానే డొనేషన్ చేయగా.. మరికొందరు మాత్రం రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయిందేమో అని భయపడిపోయారు.
వీడియోతో క్లారిటీ ఇచ్చేసి
పెద్ద పేరున్న రేణు దేశాయ్ 3500 రూపాయల కోసం రిక్వెస్ట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కొందరు నెటిజన్లు 'కోటీశ్వరురాలైన ఆమె దగ్గర రూ. 3500 లేవా' అన్నట్లుగా కామెంట్లు చేశారు. మరికొందరైతే అకౌంట్ హ్యాక్ అయిందా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాజాగా రేణు దేశాయ్ దీనిపై స్పందిస్తూ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు.

నాకూ లిమిట్స్ ఉంటాయి
రేణు దేశాయ్ తాజాగా షేర్ చేసిన సెల్ఫీ వీడియోలో 'అందరూ అడిగారు నా అకౌంట్ హ్యాక్ అవలేదు. నేను రెగ్యులర్‌గా కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తుంటాను. నా సంపాదనలో కొంత మొత్తాన్ని కేవలం ఇందుకోసమే కేటాయించాను. అయితే, అప్పుడప్పుడూ బడ్జెట్‌కు మించి కాస్త ఎక్కువ అవసరం పడుతుంది. నాకూ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా' అని అన్నారు.
నా పిల్లలకు కావాలి కదా
అదే వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'నా డబ్బునంతా డొనేషన్స్‌కు ఇచ్చేస్తే నా పిల్లల కోసం కావాలి కదా. అందువల్ల నా వరకు సాయం చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నాను. అలా చేసే మెసేజ్ అది. నా అకౌంట్ హ్యాక్ అవలేదు. నేను చిన్న పిల్లల ఫుడ్ కోసమో, జంతువుల కోసమో పని చేస్తున్నా' అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఐదు నిమిషాల్లోనే థ్యాంక్స్
రేణు దేశాయ్ కొనసాగిస్తూ.. 'జంతువుల కోసం ఓ షెడ్ నిర్మిస్తున్నా. అది అయిన వెంటనే అఫీషియల్‌గా డొనేషన్స్‌ను సేకరిస్తాను. నా పట్ల ప్రేమ, కేర్ చూపించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నా రిక్వెస్ట్‌కు 5 నిమిషాల్లో స్పందించారు. మానవత్వంతో స్పందించి రూ. 3500 పంపించిన అందరికీ ధన్యవాదాలు' అంటూ ముగించారు. మొత్తానికి రేణూ చేస్తున్న పనికి ప్రశంసలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











