మిరపకాయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ చూశారా.. లావెక్కిపోయి కొడుకుతో అలా..
సినిమా ఇండస్ట్రీ లోకి కొన్నేళ్ల వరకు హీరోయిన్ గా కొనసాగిన వారు ఆ తర్వాత పెళ్లి అనంతరం ఒక్కసారిగా మాయమైపోతూ ఉంటారు. ఇక వారు ఫ్యామిలీతో కనిపించినప్పుడు ఒక్కసారిగా వారికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక గత కొంతకాలంగా మిరపకాయ్ హీరోయిన్ ఫోటోలు కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఆమె తన ఇంగ్లీష్ ఫ్యామిలీతో కనిపించిన విధానం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాతోనే మంచి క్రేజ్
రవితేజ మిరపకాయ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. అంతకంటే ముందు ఈ బ్యూటీ లీడర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆమెకు మంచి గుర్తింపు అందించింది మాత్రం మిరపకాయ్ సినిమానే. హరిష్ శంకర్ రవితేజ కలయికలో వచ్చిన సినిమాలో ఆమె ట్రెడిషనల్ అమ్మాయిగా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.

యూఎస్ లో మిస్ ఇండియా
రిచా గంగోపాధ్యాయ న్యూఢిల్లీకి చెందిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం ఆ తర్వాత అమెరికా వెళ్ళిన రీచా అక్కడి వాతావరణంకు ఎంతగానో అలవాటైపోయింది. ఆ తర్వాత ఆమె యూఎస్ఏ లోనే మిస్ ఇండియాకి కూడా పోటీ చేసింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సొంతం చేసుకుంది.

టాలీవుడ్ సినిమాలతో..
మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న తర్వాత రీచా గంగోపాధ్యాయ తన స్నేహితుల సలహా మేరకు సినిమా ప్రపంచంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమెకు మొదట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసింది. 2010లో రానా దగ్గుపాటి మొదటి సినిమా లీడర్ సినిమాతో మొదటిసారి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు తమిళంలో బిజీగా..
మొదటి సినిమా అనంతరం రీచా గంగోపాధ్యాయ తొందరగానే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంది. నాగవల్లి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మిరపకాయ్ సినిమా మంచి హిట్ అయింది. అనంతరం ఆమెకు తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఇక మరోసారి రవితేజతో సారొచ్చారు అనే సినిమా చేసింది. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.

ఆ సినిమాతో ఇండస్ట్రీకి దూరం
ఇక నాగార్జునతో బాయ్ అనే సినిమా చేసిన రీచా ఊహించిన విధంగా డిజాస్టర్ అందుకుంది. ఆ సినిమాతో మళ్ళీ ఆమె ఇండస్ట్రీలో కనిపించలేదు. 2013లో నాగార్జున బాయ్ సినిమా డిజాస్టర్ అనంతరం రిచా గంగోపాధ్యాయ అమెరికా వెళ్లి అక్కడే తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. అక్కడే తన పూర్తి ఫ్యామిలీ లైఫ్ లో ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆమె కొంచెం లవెక్కినట్లు కూడా కనిపిస్తోంది.

కొడుకుతో అలా..
తన ఎంబీఏ ఫ్రెండ్ జోయీ లంగెళ్లను వివాహం చేసుకున్న రీచా 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు తన కొడుకుతో ఆమె ఆడుకుంటున్న ఫొటోలను ఫ్యాన్స్ ఫాలోవర్స్ తో ఆమె షేర్ చేసుకుంటూనే ఉంది. ఇక ఆమె రీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











