గ్లామర్ కంచె తెంచేసిన తెలుగమ్మాయి.. బాత్ రూంలో పరువాల విందు.. ముందెప్పుడూ చూసి ఉండరు!
ఈ మధ్య కాలం కలిసి రాని భామలు అందరూ హాట్ ఫోటోల మీద పడుతున్నారు. తమను అభిమానులు అలాగే ఇష్టపడుతున్నారు అని అనుకుంటున్నారో? లేక నిర్మాతలు అవి చూసి అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నారో? తెలియదు కానీ మొత్తం మీద అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాలం కలిసి రాక ఇబ్బందులు పడుతున్న రీతూ వర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

మొదటి రన్నరప్‌గా
రీతూ వర్మ తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు చెందినవారు అయినా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె హైదరాబాద్‌లోని విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఆమె మిస్ హైదరాబాద్ అందాల పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె మొదటి రన్నరప్‌గా నిలిచింది.

శ్రీ విష్ణు సరసన
ఆ తర్వాత ఆమె తెలుగు షార్ట్ ఫిల్మ్ 'అనుకోకుండా'లో తన నటనతో పేరు తెచ్చుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48 HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకుంది. అలాగే ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. అయితే ఆమె మొదటి సినిమా బాద్‌షా. ఆ సినిమాలో ఆమె పింకీ అనే సపోర్టింగ్ రోల్ చేసింది. తరువాత ఆమె ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో శ్రీ విష్ణు సరసన కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర పోషించింది .

పెళ్లి చూపులు సినిమాలో
ఆ తరువాత నా రాకుమారుడు (2014), ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాల్లో నటించింది కానీ పెద్దగా పేరు అయితే దక్కలేదు. విజయ్ దేవరకొండ నటించిన రొమాంటిక్-కామెడీ పెళ్లి చూపులు సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించగా ఆ సినిమా కమర్షియల్ హిట్ అయింది. అలాగే 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగులో ఉత్తమ సినిమాగా, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సినిమా అవార్డును కూడా గెలుచుకుంది.

మంచి ఆఫర్స్
ఇక ఆ తరువాత తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. సినిమాల్లో ఇప్పటి దాకా ఎలాంటి హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తూ వచ్చిన ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు.
ఎద అందాలు కనిపించేలా
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో కాస్త హద్దులు దాటుతుందేమోననిపించే విధంగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. తాజాగా రీతూ వర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలు టెంపరేచర్ పెంచేస్తున్నాయి.మునుపెన్నడూ లేని విధంగాతన స్టన్నింగ్ అందాలను ఆరబోస్తూ రీతూ వర్మ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. రెడ్ టాప్ లో ఈ ఎద అందాలు కనిపించేలా బాత్ రూంలో చేసిన ఫోటో షూట్ పిక్స్ వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











