Ritu Varma : రీతూ వర్మకు కాబోయే భర్త.. ఇలాంటి క్వాలిటీస్ తప్పనిసరి! ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతూ వర్మ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ - కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ ఫిలిం 'బాద్షా'తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ కాజల్ కు చెల్లెలుగా పింకీ పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకొని తెలుగు ప్రేక్షకులను అలరించింది. తన నటనతోను ఆడియన్స్ ను ఆకర్షించుకోగలిగింది. ఫలితంగా రీతూ వర్మ కు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు అందాయి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన 'పెళ్లి చూపులు' చిత్రంలో నటించి తొలి హిట్ ను దక్కింకుంది. అప్పటి నుంచి వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. కేశవ, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, వరుడు కావలెను, ఓకే ఒక జీవితం, మార్క్ ఆంటోనీ చిత్రాలతో అలరించింది. ఇక రీసెంట్ గా రీతూ వర్మ యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన 'మజాకా' చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సందర్భంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది.

కాగా ఈరోజు రీతు వర్మ 34వ పుట్టినరోజు జరుపుకుంటుంటడం విశేషం. ఈ క్రమంలో రీతూ వర్మ కు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా రీతూ వర్మ తనకు కాబోయే భర్త గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. మూడు పదుల వయసు దాటిన ఈ ముద్దుగుమ్మ ఇంకా తెలుగు ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తుంది. కాగా ఇంకా పెళ్లెప్పుడు అని ఆమె అభిమాను లు సోషల్ మీడియా వేదికన అడుగుతూనే ఉన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి భర్త కావాలో రీతు వర్మ నే స్వయంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆమె ఫ్యూచర్ హస్బెండ్ కు తప్పకుండా ఈ లక్షణాలు ఉండాలని చెప్పుకొచ్చింది.
తను చేసుకోబోయే భర్త ఎంతో దయ కలిగి ఉండాలని, చాలా జెన్యూన్ గా ఉండాలని, ఫేక్ పీపుల్ అంటే తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చింది. ఇంకా నిజాయితీగా ఉంటే సరిపోతుందని తన మనసులోని మాటను చెప్పింది. ఇక తను సినిమా రంగంలో ఉంది కాబట్టి సినిమా రంగంలో వారిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏమాత్రం లేదని చెప్పింది. ఏ రంగంలో పనిచేసిన చాలా దయ స్వభావాన్ని కలిగి ఉండాలని క్లారిటీ ఇచ్చింది. ఇక తనను ఎంతో బాగా చూసుకోవాలని చెప్పింది.

అలాగే తను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చాలా నేను లవ్ లెటర్స్ వచ్చాయని నిర్మొహమాటంగా అభిమానులతో పంచుకుంది. ఇంకా కాలేజీలో తన కూర్చునే బెంచ్ పై లవ్ సింబల్ వర్డ్స్ రాసేవారని చెప్పింది. ఇక కొందరైతే తన ఇంటి వరకు కూడా ఫాలో అయ్యారని గుర్తు చేసుకుంది. కానీ అలాంటివన్నీ రీతూ వర్మ కు మొదటి నుంచే నచ్చేవి కాదని చెప్పింది. అలాంటి సందర్భాల్లో ఇబ్బందికరంగా ఉండేదని, అయినప్పటికీ తను చూసి చూడనట్టుగా వదిలేసేదని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











